జనహితంగా జన్మదినం | jagan birthday east godavari | Sakshi
Sakshi News home page

జనహితంగా జన్మదినం

Published Wed, Dec 21 2016 11:55 PM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM

జనహితంగా జన్మదినం - Sakshi

జనహితంగా జన్మదినం

సేవకు ప్రతిరూపంగా జగన్‌ పుట్టినరోజు
జిల్లాలో ఘనంగా నిర్వహించిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు
 
ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బుధవారం పార్టీ శ్రేణులు జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాలు సేవలకు ప్రతిరూపంగా నిలిచాయి. నిరుపేదలు, దివ్యాంగులు, వృద్ధులు, అన్నార్తులు..ఇలా ప్రతి ఒక్కరికి పార్టీ శ్రేణులు తోచిన స్థాయిలో ఆపన్నహస్తం అందించాయి. పేదలకు సాయం చేసిన చేతులతోనే జగన్‌కు సంపూర్ణ ఆరోగ్యం కలగచేయాలని ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు నాయకత్వంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు, అనుబంధ విభాగాల నాయకులు ఊరూవాడా ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.
 
సాక్షిప్రతినిధి, కాకినాడ : జగన్‌ జన్మదినం సందర్భంగా కాకినాడ రూరల్‌ రాయుడుపాలెంలో రాష్ట్ర కార్యదర్శి లింగం రవి ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు వృద్ధులకు దుస్తులు అందజేసి పాస్టర్‌లను సత్కరించారు. గ్రీన్‌ఫీల్డ్‌ అంధుల పాఠశాలలో జగన్‌ను ఉద్దేశించి విద్యార్థులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. కన్నబాబు విద్యార్థులకు పుస్తకాలు, మిఠాయిలు పంచిపెట్టారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్‌ ఆ«ధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అన్నవరం, అయినవిల్లి, కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ యువజన విభాగం సమకూర్చిన రగ్గులను జిల్లాలోని అన్ని మండలాల్లో  పేదలు, వృద్ధులకు ఆయా నియోజకవర్గాల నేతలు పంపిణీ చేశారు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో జరిపిన పూజల్లో ప్రత్తిపాడు కోఆర్డినేటర్‌ పర్వత పూర్ణచంద్రప్రసాద్, అనంతబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు తదితరులు పాల్గొన్నారు.
పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజేశ్వరి
  రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో కేక్‌ కట్‌ చేసి రోగులకు ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పండ్లు పంపిణీ చేశారు. విలీన మండలాల్లో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రాజానగరం మండలం చక్రద్వారబంధంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా కేక్‌ కట్‌చేసి వేడుకల్లో పాల్గొన్నారు. కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమలాపురంలో పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. చిట్టబ్బాయి బర్త్‌డే కేక్‌ కట్‌ చేసి ర్యాలీగా ఏరియా ఆస్పత్రికి వెళ్లి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. 
కేక్‌ కట్‌ చేసిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
రావులపాలెం వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి జగన్‌ చిత్రంతో ఉన్న కేక్‌ కట్‌ చేశారు. కొత్తపేటలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు తదితరులు ఆస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు, దుప్పట్లు పంపిణీ చేశారు. బీసీసెల్‌ కార్యవర్గ సభ్యుడు వాసంశెట్టి శ్యామ్, జిల్లా ఎస్సీసెల్‌ అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు తదితరులు ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కో–ఆర్డినేటర్‌ పెండెం దొరబాబు పిఠాపురం పార్టీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పెద్దాపురం మున్సిపల్‌ సెంటర్‌లో కోఆర్డినేటర్‌ తోట సుబ్బారావునాయుడు కేక్‌ కట్‌ చేసి ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు అందజేశారు. సామర్లకోట సిరి మానసిక దివ్యాంగుల కేంద్రంలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అత్తిలి సీతారామస్వామి సామర్లకోట ప్రభుత్వాస్పత్రిలో గర్భిణులకు, రోగులకు పండ్లు, రొట్టెలు అందజేశారు. 
రాజమండ్రిరూరల్‌లో కో–ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు ధవళేశ్వరం పోలీసుస్టేషన్‌ సెంటర్, బొమ్మూరు వివేకానంద మహాయోగి ఆరోగ్య కేంద్రం, కడియం ప్రభుత్వాస్పత్రిలలో కేక్‌ కట్‌ చేసి కుష్ఠువ్యాధిగ్రస్తులకు పండ్లు పంపిణీ చేశారు. కో–ఆర్డినేటర్‌ గిరిజాల బాబు పార్టీ పతాకంపై గులాబీలతో జగన్‌ చిత్రపటాన్ని వేయించి జగన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. జెడ్పీ, మున్సిపల్‌ పాఠశాలల్లో కేక్‌ కట్‌ చేసి పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ధవళేశ్వరం వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో కో–ఆర్డినేటర్‌ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నేతలు రగ్గులు పంపిణీ చేశారు.
ధవళేశ్వరంలో బైక్‌ ర్యాలీ
రాజమహేంద్రవరం 17వ డివిజన్‌లో మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ కేక్‌ కట్‌ చేసి ధవళేశ్వరంలో బైక్‌ ర్యాలీ నిర్వహించి, సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, మండావారివీధిలో అన్నసమారాధన చేశారు. కడియంలో రాష్ట్ర కార్యదర్శి రావిపాటి రామచంద్రరావు వృద్ధులకు రగ్గులు, పండ్లు పంపిణీ చేశారు. జగ్గంపేట మానసిక వికలాంగుల కేంద్రంలో కో–ఆర్డినేటర్‌ ముత్యాల శ్రీనివాసరావు కేక్‌ కట్‌చేసి, శశి అనాథ శరణాలయంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. తునిలో కేక్‌ కట్‌ చేసి ఏరియా ఆస్పత్రి, వృద్ధాశ్రమంలో యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మోతుకూరి వెంకటేష్‌ తదితరులు రోగులకు రోట్టెలు, పండ్లు పంపిణీ చేశారు.  
అనపర్తి నియోజకవర్గం కుతుకులూరు, నల్లమిల్లిలో కో–ఆర్డినేటర్‌ డ్టాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి కేక్‌ కట్‌ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామవరంలో జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి బర్త్‌డే కేక్‌ కట్‌ చేశారు. రాజమండ్రి సిటీలో కో–ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, కార్పొరేషన్‌ ఫ్లోర్‌లీడర్‌ షర్మిలారెడ్డి తదితరులు పార్టీ సిటీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి గౌతమి జీవకారుణ్య సంఘంలో వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, మాజీ ఫ్లోర్‌లీడర్‌ పోలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో వృద్ధులకు చీరలు, పంచెలు, తువ్వాళ్లు, మిఠాయిలు, యువజన విభాగం కార్యదర్శి గుర్రం గౌతమ్‌ ఆధ్వర్యంలో కంబాలచెరువు సెంటర్‌లో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహం వద్ద సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి వృద్ధులకు రగ్గులను, పిల్లలకు చాకెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.   
అభిషేకాలు, హోమం
అయినవిల్లి శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో జగన్‌ పేరిట అభిషేకాలు, హోమం నిర్వహించారు. ముక్తేశ్వరం, సిరిపల్లిలో బాణసంచా కాల్పులు మధ్య కేక్‌ కట్‌ చేశారు. విలస ఆస్పత్రిలో రోగులకు రగ్గులు, పండ్లు, బిస్కెట్లు అందజేశారు. ఎల్‌.గన్నవరం శివారు నదిగాడిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి వృద్ధులకు రగ్గులు పంపిణీ చేశారు. కో–ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర కార్యదర్శులు మిండగుదిటి మోహన్, భూపతిరాజు సుదర్శన్‌బాబు పాల్గొన్నారు. మండపేటలో కో–ఆర్డినేటర్‌ వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి, పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ ఆధ్వర్యంలో అంధుల పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో కేక్‌కట్‌ చేసి విద్యార్థులకు, పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు. యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కాకినాడ సిటీలో సాంబమూర్తినగర్‌ చెవిటిమూగ పాఠశాలలో విద్యార్థులతో కోఆర్డినేటర్‌ ముత్తా శశిధర్‌ కేక్‌కట్‌ చేయించారు. సాంబమూర్తినగర్‌ దివ్యాంగ పాఠశాలలో పార్టీ సిటీ ప్రెసిడెంట్‌ ఫ్రూటీకుమార్‌ ఆధ్వర్యంలో పిల్లలతో కేక్‌కట్‌ చేయించి వేడుకలు ఘనంగా జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement