జల విద్యుత్ కేంద్రం పనుల పరిశీలన
Published Mon, Oct 17 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
దేవీపట్నం :
మండలంలోని అంగుళూరు గ్రా మం వద్ద జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రానికి చెందిన మట్టిపనులను ఏపీ జెన్‌కో డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 960 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం గల జల విద్యుత్తు కేంద్రం నిర్మాణాన్ని త్వరతగతిన పూర్తిచేయాలని సంకల్పించినట్టు తెలిపారు. ఆ దిశగా మట్టి పనులను వేగవంతం చేయాలని సైట్ అధికారులను ఆయన ఆదేశించారు. ఏపీ జెన్‌కో సల హాదారుడు ఆదిశేషు మాట్లాడుతూ ప్రస్తుతం రోజుకు 3,800 క్యూబిక్ మీటర్ల మట్టిపని మాత్రమే జరుగుతోందన్నారు. కానీ రోజుకు 30 వేల క్యూబిక్ మీటర్ల మట్టిపని చేస్తే తప్ప నిరే్ధశిత సమయానికి పనులు పూర్తికావన్నారు. ఇందుకనుగుణంగా యంత్రాలను పెంచి పనులు వేగంగా పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్ అధికారులను వారు ఆదేశించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న పనులను ఏపీ జెన్‌కో ఈఈ కొలగాని వీవీఎస్ మూర్తి వివరించారు. కార్యక్రమంలో జెన్‌కో ఇంజనీర్లు కె.రత్నబాబు, స్వామినాయుడు, కోటేశ్వరరావు, రాజ్‌కుమార్, రామకృష్ణ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
Advertisement