సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల పాత్ర కీలకం | journalists key role of society | Sakshi
Sakshi News home page

సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల పాత్ర కీలకం

Published Sun, Jul 16 2017 10:32 PM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM

సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల పాత్ర కీలకం

సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల పాత్ర కీలకం

అనంతపురం మెడికల్‌ : సమాజ శ్రేయస్సులో జర్నలిస్టుల పాత్ర కీలకమని ఎస్పీ అశోక్‌కుమార్‌ పేర్కొన్నారు.  ఆదివారం స్థానిక ఐఎంఏ హాల్‌లో ఏపీ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ (ఏపీడబ్ల్యూజేఎఫ్‌) జిల్లా మహాసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీతో పాటు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ కృష్ణయ్య, ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు హాజరై మాట్లాడారు. జర్నలిస్టులు వారికున్న సమాచారంతో వాస్తవ కథనాలు ఇస్తుంటారని, అధికారులు, ప్రజాప్రతినిధులు పాజిటివ్‌గా తీసుకోవాలన్నారు. వ్యక్తిగత రాగధ్వేషాలు పెంచుకోరాదని సూచించారు. అనంతరం యూనియన్‌ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా షఫీవుల్లా, ప్రధాన కార్యదర్శిగా రామాంజనేయులు, కోశాధికారిగా సుదర్శన్‌రెడ్డిని ప్రకటించారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని యూనియన్‌ నేతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement