వృద్ధ జంటను కలిపిన జడ్జి | judge solves old age couple problem | Sakshi
Sakshi News home page

వృద్ధ జంటను కలిపిన జడ్జి

Published Sat, Nov 12 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM

వృద్ధ జంటను కలిపిన జడ్జి

వృద్ధ జంటను కలిపిన జడ్జి

అనంతపురం లీగల్‌ : కుటుంబ న్యాయస్థానంలో చాలాకాలంగా పెండింగులో ఉన్న విడాకుల అర్జీపై జిల్లా అదనపు న్యాయమూర్తి పి.సుబ్రమణ్యకుమార్‌ ప్రత్యేక చొరవ చూపారు. తమ బిడ్డలకు వివాహాలు కూడా చేసేసిన దంపతులు ఆ తర్వాత మనస్పర్థలకు లోనై విడాకులు కోరుతున్న విషయం తెలుసుకున్న ఆయన వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఫలితంగా వారిద్దరూ ఒకరినొకరు క్షమించుకుని కలిసి జీవించటానికి సమ్మతించారు.

సంతోషించిన న్యాయమూర్తి వారిద్దరికీ పట్టువస్త్రాలు సారెగా ఇచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కుటుంబ వ్యవస్థ భారతీయతకు చిహ్నమని, వివాహ ధర్మాన్ని కాపాడటం, ధర్మం ప్రకారం నడుచుకోవటం ప్రతి ఒక్కరి భాధ్యత అని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. 

Advertisement
Advertisement