- కాకినాడ జీజీహెచ్ ఎమర్జెన్సీ విభాగం దుస్థితి
- లోపిస్తున్న అధికారుల పర్యవేక్షణ
- విధులకు ఎగనామం పెడుతున్న వైద్యసిబ్బంది
- అత్యవసర సమయాల్లో అందని వైద్యం
- ఇక్కట్లు పడుతున్న రోగులు
చికిత్స అత్యవసరం
Published Sun, Jan 22 2017 11:42 PM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM
కాకినాడ వైద్యం :
ఉభయ గోదావరి జిల్లాలకు పెద్ద దిక్కయిన కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి (జీజీహెచ్) అత్యవసర విభాగానికి అధికారులు తక్షణ చికిత్స చేపట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 24 గంటలపాటూ రోగులకు వైద్యసేవలందించాల్సిన ఈ విభాగంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపిస్తోంది. ఇదే అదునుగా కొందరు వైద్యసిబ్బంది విధులకు ఎగనామం పెడుతున్నారు. హౌస్ సర్జన్లపైనే వైద్యసేవల భారం వేయడం, సీనియర్ వైద్యులు గైర్హాజరు కావడంతో.. అత్యవసర వైద్యం సకాలంలో అందని పరిస్థితులు నెలకొన్నాయని రోగులు ఆరోపిస్తున్నారు.
ఈ విభాగం ప్రత్యేకత ఇదీ..
∙జీజీహెచ్‌కు ప్రతి రోజూ ఉభయ గోదావరి జిల్లాల నుంచి సుమారు 3 వేల మంది వస్తూంటారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి, వివిధ ప్రమాదాల్లో క్షత్రగాత్రులకు సత్వర వైద్యసేవలు అందించేందుకు ఇక్కడ అత్యవసర వైద్య విభాగం ఏర్పాటు చేశారు.
∙ఇందులో రోడ్డు ప్రమాదాలు, పురుగు మందు తాగడం, ఆత్మహత్యాయత్నాలకు పాల్పడడం, పోలీసు కేసులకు సంబంధించిన క్షతగాత్రులకు చికిత్స చేసేందుకు మెడికో లీగల్ కేస్ (ఎంఎల్‌సీ) వార్డు; గుండెపోటు, ఊపిరితిత్తుల సమస్యలు, కడుపునొప్పి, అపెండిసైటిస్ (24 గంటల కడుపునొప్పి) తదితర అనారోగ్య రుగ్మతలతో సమమతమయ్యేవారికి చికిత్స చేసేందుకు నా¯ŒS ఎంఎల్‌సీ వార్డు ఏర్పాటు చేశారు.
∙ఎంఎల్‌సీ వార్డుకు నిత్యం రోడ్డు ప్రమాదాలు, పోలీసు కేసులకు సంబంధించి 20 – 25 మంది వరకూ వస్తూంటారు.
కేసులు మరో 100 వరకూ నమోదవుతూంటాయి.
∙నా¯ŒS ఎంఎల్‌సీ వార్డుకు గుండెపోటు, కిడ్నీ, అపెండిసైటిస్ తదితర అత్యవసర పరిస్థితులకు సంబంధించి ప్రతి రోజూ సుమారు 150 దాకా కేసులు వస్తూంటాయి.
∙ఎంఎల్‌సీ వార్డులో 20, నా¯ŒS ఎంఎల్‌సీ వార్డులో 20 పడకలు ఏర్పాటు చేశారు.
∙ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడేవారికోసం క్యాజువాలిటీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (సీఐసీయూ) అందుబాటులో ఉంది.
హౌస్ సర్జన్లపైనే భారం
ఇక్కడ పనిచేసే సీనియర్ వైద్యులు, సిబ్బంది తర చూ విధులకు గైర్హాజరవుతున్నారన్న ఆరోపణలున్నాయి. దీనికితోడు పీజీ వైద్యుల కొరత వేధిస్తోం ది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ వైద్యసేవల భారం దాదా పు హౌస్ సర్జన్లపైనే పడుతోంది. కొన్ని సందర్భాల్లో క్షతగాత్రులకు అత్యవసర వైద్యం సరిగా అందించలేక హౌస్ సర్జన్లు ఇక్కట్లకు గురవుతున్నారు. సీనియర్ వైద్యులు కనుక అందుబాటులో ఉంటే వారిచ్చే సలహా మేరకు చికిత్స చేస్తున్నారు. లేకుంటే తమకు తోచిన వైద్యం చేస్తున్నారని రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. కొందరు వైద్య సిబ్బంది దురుసు ప్రవర్తనతో పలు గొడవలు కూడా సంభవిస్తున్నాయి. అయినప్పటికీ ఉన్నతాధికారులు ఈ విభాగం పర్యవేక్షణపై దృష్టి సారించలేదంటూ విమర్శలు వస్తున్నాయి.
సిబ్బంది కొరత
ఎమర్జెన్సీ విభాగంలో 24 గంటలపాటూ వైద్యం అందించేందుకు రో జుకు మూడు షిఫ్టు ల్లో వైద్య సిబ్బంది విధులు నిర్వర్తించా లి. డ్యూటీ అసిస్టెం ట్ ఫిజీషియ¯ŒS (డీఏ పీ), డ్యూటీ అసిస్టెంట్ సర్జ¯ŒS(డీఏఎస్)లు తప్పకుండా ఎంఎల్‌సీ, నా¯ŒS ఎంఎల్‌సీ వార్డుల్లో అందుబాటులో ఉండాలి. కానీ, రాత్రి సమయాల్లో ఎవరూ అందుబాటులో ఉండటం లేదని, హౌ స్ సర్జన్లపైనే భారం వేసి గైర్హాజరవుతున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఒక్కో విభాగంలో సీఎం వోతోపాటు జనరల్ మెడిసిన్, ఆర్థో, సర్జికల్‌కు చెందిన పీజీ వైద్యులతోపాటు ప్రతి షిఫ్టుకు నలుగురు హౌస్ సర్జన్లు అందుబాటులో ఉండాలి. వీరితోపాటు డ్యూటీ అసిస్టెంట్ ఫిజీషియన్, సర్జన్, ఆర్థోపెడిక్ సిబ్బంది అందుబాటులో ఉండాలి. సీనియర్ వైద్య సిబ్బంది గైర్హాజరీతో పీజీ, హౌస్ సర్జన్లు కూడా విధులకు సక్రమంగా హాజరు కావడంలేదని అక్కడ పని చేస్తున్న సిబ్బంది ఆరోపిస్తున్నారు.
జూనియర్ డాక్టర్లే చికిత్స చేస్తున్నారు.
రెండు వారాల క్రితం తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతున్న మా బంధువును రాత్రి 10 గంటల సమయంలో జీజీహెచ్ ఎమర్జెన్సీ వార్డులో చేర్పించాం. అక్కడ సీనియర్ వైద్యులు అందుబాటులో లేరు. ఆస్పత్రిలో చేరిన గంట తర్వాత హౌస్‌సర్జన్లు వంతులు వేసుకుని చివరకు వైద్యం అందించారు. గంటన్నర సేపు రోగి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడింది. సత్వర చికిత్స అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి.
– జి.నరసింహమూర్తి, కాకినాడ
సక్రమంగా సేవలందించేలా చర్యలు
ఎమర్జెన్సీ విభాగంలో రోగులకు సక్రమంగా వైద్య సేవలందించేలా చర్యలు తీసుకుంటాను. ఇక్కడ వైద్య సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది గైర్హాజరీపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ టీఎస్‌ఎ¯ŒS మూర్తి, సీఎస్‌ఆర్‌ఎంవో, జీజీహెచ్, కాకినాడ
విధులకు ఇద్దరు స్టాఫ్‌నర్సుల డుమ్మా
జీజీహెచ్ అత్యవసర విభాగాన్ని నర్సింగ్ సూపరింటెండెంట్ అక్కమాంబ ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు రెగ్యులర్ స్టాఫ్‌నర్సులు బయోమెట్రిక్‌లో హాజరు నమోదు చేసి, తర్వాత విధులకు డుమ్మా కొట్టినట్లు గుర్తించారు. ఈ మేరకు హాజరు పుస్తకంలో ఆ ఇద్దరూ గైర్హాజరైనట్టు రిమార్క్ రాశారు. విధి నిర్వహణలో అలసత్వం, విధులకు హాజరైనట్లు నమోదు చేసి, గైర్హాజరు కావడంతో స్టాఫ్ నర్సులిద్దరిపై శాఖాపరమైన చర్యకు సిఫారసు చేసినట్లు తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
Advertisement
Advertisement