కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ పదవికాలం పొడిగింపు
Published Fri, Jul 29 2016 12:41 AM | Last Updated on Tue, Oct 30 2018 7:57 PM
సాక్షి ప్రతినిధి, వరంగల్ : కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టి.వెంకటేశ్వర్‌రావును పదవి కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాదిపాటు పొడిగించింది. ఈ మేరకు వెంకటేశ్వర్‌రావును రిజిస్ట్రార్‌గా మరో ఏడాది పాటు కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాకతీయ వైద్య కళాశాలలో ఆర్థోపెడిక్ విభాగం అధిపతిగా ఉన్న వెంకటేశ్వర్‌రావు 2015 జూలై 16న రిజిస్ట్రార్‌గా ఏడాది కాలానికి నియమితులయ్యారు. ఈ నెల 16తో ఆయన పదవికాలం ము గిసింది. ఈ క్రమంలో మరో ఏడాది పాటు ఆయన పదవిని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంకటేశ్వర్‌రావు పదవికాలం పొడిగింపు నిర్ణయం ఈనెల 17వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
Advertisement
Advertisement