కాపు భవనాలకు మీ పేరేంటి? : ముద్రగడ | kapu leader open letter to ap cm chandrababu | Sakshi
Sakshi News home page

కాపు భవనాలకు మీ పేరేంటి? : ముద్రగడ

Published Mon, May 23 2016 11:29 AM | Last Updated on Sat, Aug 18 2018 6:11 PM

కాపు భవనాలకు మీ పేరేంటి? : ముద్రగడ - Sakshi

కాపు భవనాలకు మీ పేరేంటి? : ముద్రగడ

కాకినాడ: ఆంధ్రప్రదేశ్లో కాపు భవనాలకు సీఎం చంద్రబాబు పేరు పెట్టడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆయనిక్కడ చంద్రబాబుకు మరోసారి లేఖను రాశారు. ఈ లేఖలో ఆయన ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.

కాపు భవనాలకు పెట్టిన చందన్న పేరును తక్షణమే తొలగించాలని ముద్రగడ డిమాండ్ చేశారు. కాపు సంక్షేమ నిధికి ఎవరైనా నిధులు ఇవ్వొచ్చంటున్న బాబు..  పన్నుల రూపంలో కాపులు రూ.కోట్లు చెల్లించడం లేదా అని ప్రశ్నించారు. ఆ నిధుల నుంచి ఖర్చు చేయకుండా..చివరకు కాపులను అడుక్కునే వారిగా చూపడం ఎంతవరకు న్యాయమన్నారు. చంద్రబాబు వరాలు గాల్లోనే ఉంచి..ఎన్నికల ముందు కాపులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలుచేయాలన్నారు. కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సంతోషిస్తామని ముద్రగడ లేఖలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement