స్టేట్‌ ఓపెన్‌ కరాటే చాంపియన్‌షిప్‌ బ్రోచర్‌ విడుదల | karate state meet brochers gets release | Sakshi
Sakshi News home page

స్టేట్‌ ఓపెన్‌ కరాటే చాంపియన్‌షిప్‌ బ్రోచర్‌ విడుదల

Published Sat, Jul 30 2016 6:22 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

karate state meet brochers gets release

కొత్తవలస: 38వ రాష్ట ఓపెన్‌కరాటే చాంపియన్‌షిప్‌ సుమన్‌కప్‌ 2016 పోటీలకు సంబంధించిన బ్రోచర్లను విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు విశాఖలో శనివారం విడుదల చేశారు. ఈ పోటీలను కొత్తవలస మేజరుపంచాయతీ శివారు రాజపాత్రునిపాలెం సమీపంలో ఉన్న సెయింట్‌జార్జ్‌ విద్యాసంస్థల ఆవరణలో నిర్వహిస్తామని నిర్వాహకులు బీవీ.అప్పారావు తెలిపారు.ఈ పోటీలలో 10జిల్లాలకు చెందిన కరాటేచాంపియన్స్‌ పాల్గొంటారని చెప్పారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా డీఎల్‌.నారాయణ(ఏకేపీ జడ్జి)మిర్జా ఇబ్రహీం,సిహెచ్‌.నాగరాజులు వ్యవహరిస్తారన్నారు. ఈ ప్రాతంలో రాష్ట్రస్థాయి కరాటేపోటీలు నిర్వహించడం ప్రథమమని తెలిపారు.జపాన్‌ సాటోకాన్‌ కరాటే డు కనన్‌జుకో ఆర్గనైజేషన్‌ ఇండియా(బారతప్రభుత్వం గుర్తించిన సంస్థ) ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పారు. ఈ పోటీలకు రాష్ట్రస్థాయి కరాటే చాంపియన్స్‌ మాత్రమే కాకుండా జాతీయస్థాయి కరాటే చాంపియన్స్‌ కూడా హాజరవుతారని వివరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement