సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగరా మోగింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరే షన్లు, అచ్చంపేట నగర పంచాయతీలకు మార్చి 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. మున్సిపల్ ఎన్నికల చ ట్టంలో ప్రభుత్వం మార్పులు చేసి గతంలో 21 (మూడు వారాలు) రోజుల పాటు ఉండే ఎన్నికల ప్రక్రియను 14 రోజులకు (రెండు వారాలు) కుదించింది. ఎన్నికల నిర్వహణ మధ్యలో సెలవులు వచ్చినా పని దినాలుగానే ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు ‘నోటా’ అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశం కల్పించనున్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి విడుదల చేసిన ఎన్నికల షెడ్యూలు ఇదీ..
ఎన్నికల ప్రకటన: నేడు. ఇదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ
నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ: ఫిబ్రవరి 24
నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 25
నామినేషన్ల ఉప సంహరణకు ఆఖరి రోజు: ఫిబ్రవరి 26
పోలింగ్ తేదీ: మార్చి 6
రీ పోలింగ్: మార్చి 8 (అవసరం అయితేనే)
ఓట్ల లెక్కింపు: మార్చి 9