గజరాజు(ఫైల్)
కొండ దిగని గజరాజు
Published Thu, Sep 29 2016 11:13 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
– నాలుగో రోజూ ఆపరేషన్ గజ విఫలం
రామసముద్రం: అడ్డకొండ నుంచి గజరాజును కిందకు దించేందుకు చేపట్టిన ఆపరేషన్ గజ నాలుగో రోజు గురువారం కూడా విఫలమైంది. దీంతో అటవీశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏనుగుకు ఇష్టమైన చెరకు గడలు, అనాస పండ్లు, అరటికొమ్మలను అధికారులు అక్కడక్కడా వేశారు. బుధవారం రాత్రి కొండ ప్రాంతంలో వర్షం కురవడంతో ఏనుగు కొండలోనే ఉండిపోయింది. శిక్షణ పొందిన ఏనుగులైన జయంత్, వినాయక్‌ను కొండకు అటు ఇటు తిప్పుతున్నారు. అదేవిధంగా ట్రాకర్స్ ఏనుగు కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు. ఎలాగైనా ఏనుగును కొండ దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.
Advertisement
Advertisement