– రూ. వెయ్యి అపరాధ రుసుంతో ఈనెల 6వరకు ఫీజు చెల్లింపు
అనంతపురం ఎడ్యుకేషన్ : పదోతరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి అవకాశం కల్పించారు. రూ. వెయ్యి అపరాధ రుసుంతో ఈనెల 6 వరకు ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. హెచ్‌ఎంలు 7న బ్యాంకులో చెల్లించాలని, 8న డీఈఓ కార్యాలయంలో నామినల్‌రోల్స్ అందజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పది విద్యార్థులకు ఇదో చివరి అవకాశం!
Published Wed, Feb 1 2017 10:47 PM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM
Advertisement
Advertisement