last chance
-
కలిసి ఏడుద్దాం – నా కల నిజం చేద్దాం
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ దీస్కొని బొందల గడ్డ కాడ్కి బోయిండు. గాడ రొండం త్రాల బంగ్లల బేతాలుడుంటున్నడు. విక్రమార్కుడు మోటరాపి హారన్ గొట్టిండు. బేతాలుడింట్ల కెల్లి ఇవుతలి కొచ్చిండు. ఎన్క సీట్ల ఆరాంగ గూసుండు. విక్రమార్కుడు మోటర్ నడ్ప బట్టిండు. గప్పుడు బేతాలుడు– ‘‘ఎండ గొడ్తున్నా, ఆనదంచి గొడ్తున్నా, సలి వొన్కిస్తున్నా తాతీల్ దీస్కోకుంట దినాం వొస్తవు. గుంతలు, ఎత్తుగడ్డలని సూడకుంట మోటర్ నడ్పుతవు. ఎవడన్న నీ మోటర్‌కు అడ్డం రావొచ్చు. ఎంటిక మందంల టక్కర్ గాక పోవచ్చు. నీ మోటర్ ట్రాఫిక్ల ఇర్కపోవచ్చు. నీకు యాస్ట రావొచ్చు. నువ్వు యాస్ట మర్సెతంద్కు ఒక మజేదార్ ముచ్చట జెబ్త ఇను’’ అని అన్నడు. ‘‘చెప్పుడు నీ పని. ఇనుడు నా పని’’ అని విక్ర మార్కుడన్నడు. ‘‘చెంద్రబాబుకు ముక్యమంత్రి కుర్సి ఉన్నా నిద్ర రాదు. లేకున్నా నిద్ర రాదు’’ అన్కుంట బేతా లుడింకేమో జెప్పబోతుంటె అడ్డం దల్గి, ‘‘ఎందుకు రాదు’’ అని విక్రమార్కుడ డిగిండు. ‘‘చెంద్రబాబు ముక్యమంత్రిగ ఉండంగ కుర్సి దిగితె పౌరన్ ఎవలన్న గా కుర్సిల గూసోవొచ్చనేటి బయంతోని నాత్రిపూట గుడ్క నిద్ర పోలేదు. ఏం జేస్తె ముక్యమంత్రి కుర్సి వొస్తదా అని పగటీలి నాత్రి పూట ఒక్క తీర్గ ఆలోచన జేస్తుండ బట్కె గాయినకు నిద్రొస్తలేదు.’’ ‘‘ముక్యమంత్రి కుర్సి కోసం గిప్పుడు గాయినేం జేస్తున్నడు?’’ ‘‘గీ నడ్మ గాయిన పవన్ కల్యాన్ తాన్కి బోయిండు. గ్లిజరిన్ కంట్లె ఏస్కుంటె నీకు ఏడ్పొస్తది. గని గ్లిజరిన్ లేకున్నా నాకు ఏడ్పు వొస్తది. నా పెండ్లాంను తిట్టిండ్రనుకుంట అసెంబ్లిల నేను పల్ల పల్ల ఏడ్సిన. నువ్వు నేను గల్సి జెనం తాన్కి ఏడ్సు కుంటబోదాం. మోదీని బత్మిలాడు. గాయినను గుడ్క మనతోని గల్సి రమ్మను. ముగ్గురం గల్సి ఏడిస్తిమా అంటె మన ఏడ్పుల జగన్ సర్కార్ కొట్క బోతది. కాపుదనంకు కమ్మదనం గలిస్తె ఎదురుండదు అని చెంద్రబాబు పవన్తోని అన్నడు. అనుడే గాకుంట గిదే నాకు ఆక్రి మోక అన్కుంట ఒక్క తీర్గ ఏడ్సిండు.’’ ‘‘మల్ల మున్పటి లెక్క టీడీపీతోని సోపతి జెసెతంద్కు బీజేపీ రడీగున్నడా?’’ ‘‘అసల్ లేదు. సైకిల్ బిరక్ ఫేలైంది. పయ్య లల్ల గాలిబోయింది. గిప్పుడు గది శీకట్ల ఉన్నది. తెల్లా రంగనే మా తామరపువ్వు విచ్చుకుంటది. పగటీ లంత గట్లే ఉంటది. శీకట్ల ఉండేటి టీడీపీ తోని మా పార్టి సోపతి జేసే సవాల్ లేదు అని బీజేపీ ఎంపీ జి.వి.ఎల్. నరసింహారావు అన్నడు. జనసేన తోని పొత్తు గూడ్తం. గా పార్టితోని గల్సి వొచ్చేటి అసెంబ్లి ఎలచ్చన్ల పోటీ జేస్తం. టీడీపీకి మాకు జమా యించదు. చెంద్రబాబును సస్తె నమ్మం అని ప్రతాని అన్నడు.’’ ‘‘చెంద్రబాబు గిన జెనం తాన్కి బోయిండా?’’ ‘‘గీ నడ్మ మూడు దినాలు చెంద్రబాబు కర్నూలు జిల్లల దిర్గిండు. గిప్పుడున్నది శాసనసబ గాదు. కౌరవుల సబ. నేను ముక్యమంత్రినైతె గది పాండవుల సబ అయితది. నేను ముసలోన్ని అయిన. నాకు గిదే ఆక్రి మోక. నన్ను ముక్యమంత్రి కుర్సి మీద గూసుండబెడ్తె అమరావతిని రాజదాని జేస్త. ఇంద్రుని రాజదాని అమరావతి. గదే తీర్గ గీ చెంద్రుని రాజదాని గుడ్క అమరావతే అని చెంద్ర బాబు అన్నడు.’’ ‘‘ముక్యమంత్రి కుర్సి కోసం చెంద్రబాబు ఇంకేం జేసిండు?’’ ‘‘బాబు ఒక సన్నాసి తాన్కి బోయిండు. గాయిన కాల్లు మొక్కిండు. మల్ల ముక్యమంత్రిని గావాలంటె ఏం జెయ్యాలని అడిగిండు. దినాం తెల్లారి నాలుగ్గొట్టంగనే నిద్ర లెవ్వాలె. నెత్తిమీది కెల్లి తానం జెయ్యాలె. శివుని గుడికి బోవాలె. లింగంకు అబిసేకం చేసి మారెడాకులతోని పూజ జెయ్యాలె. శ్రీశైలం బోవాలె. వెయ్యిమందికి మెడల ఏస్కునే తంద్కు బంగారి లింగాలు ఇయ్యాలె. పెయ్యికి బూడ్ది బూస్కోవాలె అని జెప్పిండు. సన్నాసి జెప్పిన తీర్గనే చెంద్రబాబు జెయ్య బట్టిండు. గట్ల జేస్తుండంగ ఒక నాత్రి గాయినకు కల బడ్డది. గా కలల శంకరుడు గండ్లబడ్డడు. దేవా! జగన్ సర్కార్‌ను గూలగొట్టెతంద్కు నాకు పాశుపతాస్త్రం ఇయ్యి అని శివున్ని అడిగిండు. గాయినకు శంకరుడా అస్త్రమిచ్చిండా? జవాబు ఎర్కుండి గూడ జెప్పకుంటివా నీ మోటర్ బిరక్ ఫేలైతది’’ అని బేతాలుడన్నడు. ‘‘అన్ని అస్త్రాలను మించిన వెన్నుపోటు అస్త్రం నీ తాన ఉండంగ వేరె అస్త్రంతోని పనేంది అని శంకరుడున్నడు’’ అని విక్రమార్కుడు జెప్పంగనే మోటర్ దిగి బేతాలుడు బొందల గడ్డ దిక్కు బోయిండు. తోక: గీ నడ్మ కుల నిర్మూలన సబకు మా సత్నారి బోయిండు. ‘‘సార్! మీ స్పీచ్ అదిరింది’’ అని ఒక పెద్దాయనతోని గాడు అన్నడు. ‘‘ఇంతకు మీరేంటోల్లు’’ అని గాయిన సత్నారి నడిగిండు. (క్లిక్ చేయండి: పవన్ కల్యాన్ గూడ జన సేనను తెలుగుదేసంల కల్పుతడేమో..) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
ఆ భూముల’పై ఇదే చివరి అవకాశం
⇒ నిరుపయోగ సెజ్ భూములపై కౌంటర్ దాఖలు చేయని రాష్ట్రాలు ⇒ చివరి అవకాశమిస్తూ 8 వారాలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీ: నిరుపయోగంగా ఉన్న స్పెషల్ ఎకనమిక్ జోన్(సెజ్) భూముల వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు సుప్రీం కోర్టు చివరి అవకాశాన్ని ఇచ్చింది. నిరుపయోగంగా ఉన్న ఈ భూములను వెనక్కి ఇవ్వాలని, వీటిలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలంటూ కాకినాడ సెజ్ బాధిత రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్.ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. శుక్రవారం ఈ కేసు విచారణకు రాగా కేంద్ర ప్రభుత్వం ఈ పిటిషన్లో మొదటి ప్రతివాదిగా కేబినెట్ సెక్రటరీని పెట్టారని, జాబితా నుంచి దీనిని తొలగించాలని కోరగా ధర్మాసనం అందుకు నిరాకరించింది. గత విచారణ సందర్భంగా ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కౌంటర్ దాఖలు చేయలేదు. న్యాయస్థానం ఇచ్చిన అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకోనందున, ఇక విచారణ ముందుకు సాగాలని పిటిషనరు తరఫున న్యాయవాదులు కొలిన్ గోన్సాల్వేస్, కె.శ్రవణ్‌కుమార్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌లోని అంశాలతో వారు ఏకీభవించినట్లుగా ధర్మాసనం పరిగణించాలని విన్నవించారు. సెజ్‌లలో 50 వేల ఎకరాలు నిరుపయోగంగా ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంలో మొత్తం 20 రాష్ట్రాలు ఉన్నాయని, సెజ్ యాజమాన్యాలను ఇందులో ప్రతివాదులుగా చేయలేదని పేర్కొన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాదులు కేంద్రాన్ని లక్ష్యంగా చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. దీనికి పిటిషన్ తరుఫు న్యాయవాది స్పందిస్తూ, సెజ్‌ల పేరుతో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, కేంద్రం అనుమతితో రైతుల వద్ద నిర్ధాక్షిణ్యంగా లాక్కున్నారని, వాటిని నిరుపయోగంగా పెట్టారని వాదించారు. పైగా ఆయా స్థలాలను బ్యాంకుల వద్ద పెట్టి రుణాలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ సొమ్ములను ఇతర అవసరాల కోసం మళ్లించారని చెబుతూ.. ఇందుకు సాక్ష్యంగా కాగ్ నివేదికను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రాలు కౌంటర్ దాఖలు చేసేందుకు చివరి అవకాశాన్నిస్తూ నాలుగు వారాలు గడువు ఇచ్చారు. విచారణను 8 వారాలకు వాయిదావేశారు. తదుపరి దశలో తుది విచారణ జరుపుతామని పేర్కొన్నారు. -
పది విద్యార్థులకు ఇదో చివరి అవకాశం!
– రూ. వెయ్యి అపరాధ రుసుంతో ఈనెల 6వరకు ఫీజు చెల్లింపు అనంతపురం ఎడ్యుకేషన్ : పదోతరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి అవకాశం కల్పించారు. రూ. వెయ్యి అపరాధ రుసుంతో ఈనెల 6 వరకు ఆయా పాఠశాలల హెచ్ఎంలకు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. హెచ్ఎంలు 7న బ్యాంకులో చెల్లించాలని, 8న డీఈఓ కార్యాలయంలో నామినల్‌రోల్స్ అందజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ఓపెన్‌స్కూల్ ప్రవేశాలకు చివరి అవకాశం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అపరాధ రుసుముతో ఈ నెల 29 వరకు చివరి అవకాశం కల్పించినట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖాధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులలో ప్రవేశాలకు ఇది చివరి అవకాశమన్నారు. అభ్యర్థులు స్టడీ సెంటర్లలోని కో–ఆర్డినేటర్లను సంప్రదించాలన్నారు. -
నల్ల ధనం వెల్లడికి ఇదే చివరి అవకాశం
-
ఇదే చివరి అవకాశం..త్వరపడండి!
ముంబై: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్లతో చెల్లింపులకు నేడే (నవంబర్ 24)చివరి రోజు. రద్దయిన రూ.500, రూ.1000 నోట్ల వినియోగానికి ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ఇవాల్టితో ముగియనుంది. ముఖ్యంగా పెట్రోల్ బంకులు, హాస్పిటల్స్,రైలు, బస్సు టికెట్లు సహా ప్రభుత్వానికి సంబంధించిన బిల్లులు చెల్లించడానికి రద్దయిన పాతనోట్ల అనుమతికి రోజు అర్థరాత్రి వరకే అవకాశం ఉంది. పాతనోట్లని కేవలం బ్యాంకుల్లో మార్పిడికి, లేదా డిపాజిట్లు చేసేందుకు అవకాశం ఉంది. అది కూడా డిశెంబర్ 30 వరకే. 1.ప్రభుత్వాసుపత్రులు 2. రైల్వే టిక్కెట్లు 3.పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ 4. ఎయిర్ లైన్ టిక్కెట్లు 5. మిల్క్ బూత్స్ 6. బరియల్ గ్రౌండ్స్ (శ్మశానాలు) 7. పెట్రోల్ బంకులు 8, మెట్రో రైలు టిక్కెట్లు 9. నేషనల్ హైవేలపై టోల్ ఛార్జీలు 10. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లతో మెడిసిన్స్ 11. ఎల్పీ జీ సిలిండర్స్ 12. రైల్వే కేటరింగ్స్ 13.కరెంట్, వాటర్ బిల్స్ 14. ఆర్కియాలజీ సర్వే డిపార్ట్ మెంట్ల ఎంట్రీ టిక్కెట్లు 15. కోఆపరేటివ్ స్టోర్లు 16. ప్రభుత్వశాఖలు విధించిన పన్నులు, జరిమానాలు 17. ప్రభుత్వ సంస్థలు విక్రయించే విత్తన విక్రయ కేంద్రాలు కాగా నవంబర్ 8 న కేంద్ర ప్రభుత్వం ప్రకటించి పెద్ద నోట్ల రద్దు దేశవ్యాప్తంగా ఆందోళన రాజేసింది. అటు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కూడా ఈ వ్యవహారంతో అట్టుడుకుతున్నాయి. మరోవైపు ఆర్థికశాఖ ఎన్ని ఉపశమన చర్యలు ప్రకటిస్తున్నప్పటికీ, 16రోజుల తర్వాత కూడా బ్యాంకుల వద్ద, ఏటీఏం సెంటర్ల వద్ద జనం పడిగాపులు మాత్రం కొనసాగుతున్నాయి. అటు పాత నోట్ల చలామణి గడువును పొడిగించాలన్న డిమాండ్ కూడా భారీగానే వినిపిస్తున్న సంగతి తెలిసిందే. -
చివరి అవకాశం!
మిగులు భూముల క్రమబద్ధీకరణపై కలెక్టర్ రఘునందన్‌రావు ♦ 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి ♦ క్రమబద్ధీకరించుకోని స్థలాలు వెనక్కి.. ♦ యూఎల్సీ స్థలాల రెగ్యులరైజేషన్‌తో రూ.వెయ్యి కోట్ల రాబడిట ♦ విలేకరుల సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పట్టణ భూ గరిష్ట పరిమితి (యూఎల్సీ) భూములను క్రమబద్ధీకరించుకోవడానికి ఇదే చివరి అవకాశమని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు వెల్లడించారు. ఈ నె ల 25వ తేదీలోపు దరఖాస్తులను సమర్పించాలని, గడువు పొడగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ మిగులు భూములుగా గుర్తించిన ఖాళీ స్థలాలనే క్రమబద్ధీకరించనున్నట్లు ఆయన చెప్పారు. దరఖాస్తు చేయని మిగులు భూములను 22ఏ కింద ప్రకటించి వీటిని ప్రజోపయోగ అవసరాలకు లేదా వేలం ద్వారా ప్రభుత్వం విక్రయిస్తుందని తెలిపారు. శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో హైదరాబాద్ కలెక్టర్ రాహుల్‌బొజ్జ, జేసీ రజత్కుమార్సైనీతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. జంట జిల్లాల్లో 672 ఎకరాల విస్తీర్ణంలో వివాదరహిత యూఎల్సీ స్థలాలున్నాయని, వీటిని క్రమబద్ధీకరణకు జీఓ 92ను జారీచేసిన ట్లు తెలిపారు. ఆర్డీఓ అధ్యక్షతన గల కమిటీ మూడు వేల గజాల వరకు క్రమబద్ధీకరిస్తుందని, అపై విస్తీర్ణం కలిగిన స్థలాలు మాత్రం ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో 601 ఎకరాల విస్తీర్ణంలో మిగులు భూములు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామని, ప్రతి కాలనీకి ప్రత్యేక బృందాలను పంపి క్రమబద్ధీకరణ సమాచారాన్ని ఆక్రమణదారులకు తెలియపరిచామని తెలిపారు. నిర్ధారించిన ఖాళీ మిగులు భూములు 5,700 మంది పొజిషన్లో ఉన్నట్లు గుర్తించామని, వీరిలో 250 గజాల్లోపు దాదాపు 4,200 మంది వరకు ఉన్నారని తెలిపారు. అంతేగాకుండా.. ఆయా భూములకు సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 750 దరఖాస్తులు వచ్చాయని, రెండు జిల్లాల్లో యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణ ద్వారా కనిష్టంగా రూ.1000 కోట్ల మేర ఖజానాకు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. కోర్టు పరిధిలో ఉన్న గురుకుల్ ట్రస్ట్ భూములను క్రమబద్ధీకరించే అవకాశంలేదని కలెక్టర్ రఘునందన్ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 71 ఎకరాల పరి ధిలో ఖాళీ మిగులు భూములున్నాయని, వీటి ని క్రమబద్ధీకరిస్తామని రాహుల్ బొజ్జ చెప్పా రు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దరఖాస్తు ఇలా... ♦ రిజిస్టర్ సేల్ డీడ్, దరఖాస్తు పత్రం, ఆధార్ కార్డును జతపరిచి మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు సమర్పించాలి. ♦ దస్తావేజు గత నెల 26వ తేదీకి ముందు రిజిస్టర్ అయి ఉండాలి. ♦ దరఖాస్తుతోపాటు రూ.2,035 ప్రాసెస్ రుసుము మీ సేవ కేంద్రంలో చెల్లించాలి. ♦ క్రమబద్ధీకరణ ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన మిగులు భూములకే వర్తిస్తుంది. చెల్లించాల్సిన రుసుం ♦ 250 గజాల వరకు మే 26, 2016 నాటి రిజిస్ట్రేషన్ విలువలో 25శాతం ♦ 251 -500 గజాల వరకు నిర్దేశిత విలువలో 50 శాతం ♦ 500 గజాలపైబడిన స్థలాలకు నిర్ధిష్ట రిజిస్ట్రేషన్ విలువలో 75 శాతం ♦ గుర్తించిన మురికివాడల్లో 125 గజాల వరకు పది శాతం ♦ క్రమబద్ధీకరణకు అర్హమైనవిగా తేల్చి నోటీసులు అందుకున్న దరఖాస్తుదారులు నెలరోజుల్లోపు 40శాతం, ఆ తర్వాత మూడు మాసాల్లో 30శాతం, మిగతా మొత్తం నోటీసు తీసుకున్న ఏడు మాసాల్లోపు చెల్లించాల్సి ఉంటుంది. ♦ నిర్దేశిత మొత్తాన్ని ఏకకాలంలో చెల్లించినవారికి ఐదుశాతం డిస్కౌంట్‌ను కూడా ప్రభుత్వం ప్రకటి ంచింది. -
ఆఖరి అవకాశం!
►పరువు కోసం దక్షిణాఫ్రికా ఆరాటం ► నేటి నుంచి భారత్‌తో చివరి టెస్టు ► ఆత్మవిశ్వాసంతో కోహ్లిసేన గత తొమ్మిదేళ్లుగా ఆతిథ్య జట్ల నుంచి ఎలాంటి విషమ పరీక్ష ఎదురైనా అలవోకగా ఎదుర్కొన్న దక్షిణాఫ్రికా ఇప్పుడు పరువు కోసం పాకులాడుతోంది. నంబర్‌వన్ హోదాలో భారత్‌లో అడుగుపెట్టిన సఫారీలు ఊహించని రీతిలో టెస్టు సిరీస్‌లో ఘోరపరాజయం పాలయ్యారు. దీంతో నేడు మొదలుకానున్న ఆఖరి టెస్టులోనైనా గెలిచి పోయిన పరువు కొంతైనా కాపాడుకోవాలనే తాప త్రయంలో ఉన్నారు. మరోవైపు వరుస విజయాలతో ఊపుమీదున్న భారత్ అతిపెద్ద సిరీస్ విజయం కోసం ఆసక్తిగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత్, దక్షిణాఫ్రికాల మధ్య మ్యాచ్ అంటే చర్చ నేరుగా పిచ్పైకే వెళ్లిపోతున్న నేపథ్యంలో ఇరుజట్ల మధ్య మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. నేడు (గురువారం) ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ప్రారంభంకానున్న ఆఖరిదైన నాలుగో టెస్టులో టీమిండియాతో ప్రొటీస్ జట్టు అమీతుమీ తేల్చుకునేందు సిద్ధమైంది. ఇప్పటికే 2-0తో సిరీస్ గెలిచిన కోహ్లిసేన మరో భారీ విజయంతో సిరీస్‌ను ముగించాలని భావిస్తోంది. అయితే నాగ్‌పూర్ వికెట్ నాసిరకమని మ్యాచ్ రిఫరీ ఐసీసీకి ఫిర్యాదు చేయడంతో ఫిరోజ్ షా పిచ్‌పై బీసీసీఐ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. బ్యాటింగ్‌పై దృష్టి: ఓవరాల్‌గా స్పిన్నర్ల ప్రతిభతోనే సిరీస్ గెలిచిన భారత్ ఇప్పుడు బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ సిరీస్‌లో విజయ్, పుజారాలు మాత్రమే అర్ధసెంచరీలు చేశారు. లోకల్ హీరోలు ధావన్, కోహ్లిలలో ఒక్కరు భారీ ఇన్నింగ్స్ ఆడినా ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఢోకా ఉండదు. మూడో టెస్టులో ఆడిన రోహిత్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాల్లేవు. ఎందుకంటే సహజంగానే స్లో, లో బౌన్స్ కలిగిన కోట్లా పిచ్ ప్రతి రోజు ఉదయం సీమర్లకు అనుకూలిస్తుంది. కాబట్టి రోహిత్ స్థానంలో మరో సీమర్‌కు అవకాశం దక్కవచ్చు. గత కొన్ని రోజులుగా భారత్ ఏ ఇన్నింగ్స్‌లోనూ భారీ స్కోరు చేయలేకపోతుండటం మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. ఈ మ్యాచ్‌లో ఆ లోటును భర్తీ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక బౌలింగ్‌లో ‘స్పిన్ త్రయం’ సూపర్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. దీనికి తోడు సొంతగడ్డపై ఇషాంత్ చెలరేగితే ప్రొటీస్‌కు కష్టాలు తప్పవు. రెండో సీమర్‌గా వరుణ్ ఆరోన్ లేదా బిన్నీలలో ఒకర్ని తీసుకోవచ్చు. మోర్కెల్పైనే భారం: ఇప్పటికే సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికాను గాయాల బెడద పీడిస్తోంది. గజ్జల గాయంతో స్టెయిన్ ఆఖరి టెస్టుకూ దూరమయ్యాడు. దీంతో పేస్ అటాకింగ్ భారం మొత్తం మోర్కెల్పైనే పడింది. అబాట్, రబడ, డిలాంజ్లకు అనుభవం తక్కువగా ఉండటం భారంగా మారింది. అయితే పిచ్ పేస్‌కు అనుకూలిస్తే వీళ్లలో ఒక్కరు ఫామ్‌లోకి వచ్చినా భారత బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు తప్పవు. ప్రధాన స్పిన్నర్ తాహిర్ మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎల్గర్, హార్మర్ వాళ్ల స్థాయిలో రాణిస్తున్నా... కీలక సమయంలో భాగస్వామ్యాలను విడగొట్టలేకపోతున్నారు. ఇక బ్యాటింగ్ మొత్తం డివిలియర్స్‌పైనే ఆధారపడి ఉంది. ఆమ్లా, ఎల్గర్, వాన్ జెల్, డు ప్లెసిస్‌లు పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమవుతున్నారు. దీంతో ఏబీపై ఒత్తిడి పెరిగిపోతోంది. లోయర్ ఆర్డర్ కనీసం ఓ స్థాయి పోరాటం కూడా చేయలేకపోవడం మేనేజ్మెంట్ను ఆందోళనలో పడేసింది. ఓవరాల్‌గా ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో భారత్‌ను నిలువరించడం ప్రొటీస్‌కు తలకు మించిన పనే. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, విజయ్, పుజారా, రహానే, సాహా, జడేజా, అశ్విన్, మిశ్రా, ఇషాంత్, రోహిత్ / ఆరోన్ / బిన్నీ. దక్షిణాఫ్రికా: ఆమ్లా (కెప్టెన్), ఎల్గర్, వాన్ జెల్/బావుమా, డివిలియర్స్, డు ప్లెసిస్, డుమిని, విలాస్, హార్మర్ / పిడెట్ / డిలాంజ్, రబడ / అబాట్, మోర్కెల్, తాహిర్. పిచ్: వికెట్‌పై పచ్చికను బాగా తొలగించారు. తొలి సెషన్ నుంచే స్పిన్‌కు అనుకూలమైనా... పొగమంచు, తేమ కారణంగా ఆరంభంలో పేసర్లకూ అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. వాతావరణం: వర్షం ముప్పు లేదు. మంచి ఎండ కాస్తోంది. ఐదు రోజులు మ్యాచ్‌కు ఎలాంటి అడ్డంకి లేదు. -
నల్లధన చట్టంతో ప్రపంచ దేశాల సరసన భారత్
న్యూఢిల్లీ: నల్ల కుబేరులపై కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్రం ప్రతిపాదించిన చట్టంతో భారత్ నల్లధనంపై ఉక్కుపాదం మోపుతున్న సింగపూర్, బ్రిటన్, అమెరికా తదితర దేశాల సరసన చేరనుంది. ఆదాయ వివరాల దాచివేత, విదేశాల్లోని ఆస్తులకు సంబంధించి పన్ను ఎగవేత తదితర నేరాలకు పాల్పడేవారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, 300 రెట్ల జరిమానా తదితర ప్రతిపాదనలతో చట్టాన్ని తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం తెలిసిందే. కాగా, విదేశాల్లో నల్లధనం కలిగివున్న భారతీయులు తమ విదేశీ బ్యాంకు ఖాతాలు లేదా సంపద గురించి ప్రభుత్వానికి తెలియజేసేందుకు చివరి అవకాశమిస్తున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా ఆదివారం పేర్కొన్నారు. -
నేడు చివరి చాన్స్
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఓటర్ల జాబితాలో పేర్లను నమోదు చేసుకునేందుకు ఆదివారం చివరి అవకాశాన్ని ఇస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొత్త ఓటర్ల నమోదు కోసం రాష్ట్రంలోని 60,418 పోలింగ్ కేంద్రాలనే ప్రత్యేక శిబిరాలుగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేర్లను నమోదు చేసుకోవచ్చని అన్నారు. చిరునామా, వయసు ధృవీకరణ పత్రాలను వెంట తీసుకువచ్చి ఫారం 6ఐను భర్తీ చేయడం ద్వారా ఓటరుగా మారవచ్చని చెప్పా రు. గత అక్టోబరు నాటికి రాష్ట్రంలో 25 లక్షల మంది కొత్త ఓటర్లుగా నమోదైనట్లు తెలిపారు. వారిలో 8 లక్షల మందికి ఫొటోతో కూడిన ఓటరు గుర్తింపు కార్డును కూడా జారీచేశామని అన్నారు. అలా గుర్తింపుకార్డు పొందని వారు ప్రత్యేక శిబిరాలను ఆశ్రరుుంచవచ్చని చెప్పారు. పజల సౌకర్యార్థం ప్రతి శిబిరం వద్ద ఓటర్ల జాబితాను ప్రకటిస్తున్నామని అన్నారు. భర్తీ చేసిన ఫారంపై సదరు వ్యక్తి తన సెల్‌ఫోన్ నెంబరును ఖచ్చితంగా పొందుపరిస్తే అన్ని వివరాలను ఎస్ఎమ్ఎస్ ద్వారా పంపుతామని తెలిపారు. శిబిరాల వద్దకు రాలేని వారు ఆన్లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఎన్నికలల్లో వివిధ పార్టీల తరపున ప్రచారం చేయదలచుకున్నవారు తమ పేర్లను ఏప్రిల్ 5 వ తేదీలోగా తమకు అందజేయాలని కోరారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చును లెక్కకట్టేందుకు ప్రచారకర్తలు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో సీఎం జయలలిత ఫొటోలను, రెండాకుల చిహ్నాలను, బ్యానర్లను తొలగించే కార్యక్రమం ముమ్మురంగా సాగుతోందని తెలిపారు. ఈ ప్రక్రియను శుక్రవారం నుంచే మొదలుపెట్టామని వివరించారు. నోటుపై ఫిర్యాదు ఓటర్లను మభ్యపెట్టేందుకు ఏ పార్టీవారైనా కరెన్సీనోట్లు అందజేస్తే 044- 1950 ఫోన్ నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేయాలని ఆయన కోరారు. -
లాస్ట్ చాన్స్
ఇప్పటివరకు ఓటు హక్కు పొందనివారు.. తాజా జాబితాల్లో చోటు దక్కనివారికి సదవకాశం. రాబోయే ఎన్నికల్లో అందరూ ఓటుహక్కు వినియోగించు కునేందుకు వీలుగా ఎన్నికల కమిషన్ మరోసారి ఓటు నమోదుకు అవకాశం కల్పించింది. ఈనెల తొమ్మిదో తేదీ ఆదివారం జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటు నమోదుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇంకెందుకాలస్యం.. రేపటి ఓటు నమోదుకు సిద్ధం కండి! ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం మరో అవకాశం ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇదే లాస్ట్ చాన్స్ అంటూ యువతను జిల్లా యంత్రాంగం సమాయత్తం చేస్తోంది. వరుస ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన అవకాశాన్ని మిగిలిపోయిన వారంతా సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏకకాలంలో 3,521 పోలింగ్ కేంద్రాల్లో... ఈ నెల ఐదున కేంద్ర ఎన్నికల సంఘం 16వ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఇంకా ఓట్లు నమోదుకాని వారు ఉన్నారన్న సంగతిని గుర్తించింది. దీంతో దేశ వ్యాపితంగా కొత్త ఓట్ల నమోదు, మార్పులకు ఎన్నికలకు ముందే ఎలక్షన్ కమిషన్ చివరి అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.రఘునందన్‌రావు కొత్త ఓట్ల నమోదుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా వ్యాప్తంగా 3,521 పోలింగ్ కేంద్రాల్లోను ఏకకాలంలో ఓట్ల నమోదు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్ల చేర్పులు, మార్పులు చేసుకోవచ్చు. వరుస ఎన్నికల్లో ఐదు ఓట్లు... జిల్లాలో 2014 జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా గత ఏడాది చివరిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లాలో 69 వేలకు పైగా కొత్త ఓటర్లు నమోదయ్యారు. వారికి కొత్త జాబితాలో చోటు దక్కడంతో వరుస ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవకాశం వచ్చింది. ఒకేసారి మున్సిపల్, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో పాటు మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు సైతం వచ్చే అవకాశం ఉండటంతో ఓటు హక్కు పొందేలా యువత ఈ నెల తొమ్మిదిన అవకాశం ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఓటు నమోదు ఇలా.. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించనున్న 2014 సాధారణ ఎన్నికలలో ఓటుహక్కు లేనివారు ఈ నెల తొమ్మిదిన దరఖాస్తు చేసుకోవచ్చు.