నేడు చివరి చాన్స్
Published Sun, Mar 9 2014 12:54 AM | Last Updated on Mon, Oct 8 2018 7:36 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఓటర్ల జాబితాలో పేర్లను నమోదు చేసుకునేందుకు ఆదివారం చివరి అవకాశాన్ని ఇస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొత్త ఓటర్ల నమోదు కోసం రాష్ట్రంలోని 60,418 పోలింగ్ కేంద్రాలనే ప్రత్యేక శిబిరాలుగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేర్లను నమోదు చేసుకోవచ్చని అన్నారు. చిరునామా, వయసు ధృవీకరణ పత్రాలను వెంట తీసుకువచ్చి ఫారం 6ఐను భర్తీ చేయడం ద్వారా ఓటరుగా మారవచ్చని చెప్పా రు. గత అక్టోబరు నాటికి రాష్ట్రంలో 25 లక్షల మంది కొత్త ఓటర్లుగా నమోదైనట్లు తెలిపారు. వారిలో 8 లక్షల మందికి ఫొటోతో కూడిన ఓటరు గుర్తింపు కార్డును కూడా జారీచేశామని అన్నారు. అలా గుర్తింపుకార్డు పొందని వారు ప్రత్యేక శిబిరాలను ఆశ్రరుుంచవచ్చని చెప్పారు.
పజల సౌకర్యార్థం ప్రతి శిబిరం వద్ద ఓటర్ల జాబితాను ప్రకటిస్తున్నామని అన్నారు. భర్తీ చేసిన ఫారంపై సదరు వ్యక్తి తన సెల్‌ఫోన్ నెంబరును ఖచ్చితంగా పొందుపరిస్తే అన్ని వివరాలను ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా పంపుతామని తెలిపారు. శిబిరాల వద్దకు రాలేని వారు ఆన్‌లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఎన్నికలల్లో వివిధ పార్టీల తరపున ప్రచారం చేయదలచుకున్నవారు తమ పేర్లను ఏప్రిల్ 5 వ తేదీలోగా తమకు అందజేయాలని కోరారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చును లెక్కకట్టేందుకు ప్రచారకర్తలు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో సీఎం జయలలిత ఫొటోలను, రెండాకుల చిహ్నాలను, బ్యానర్లను తొలగించే కార్యక్రమం ముమ్మురంగా సాగుతోందని తెలిపారు. ఈ ప్రక్రియను శుక్రవారం నుంచే మొదలుపెట్టామని వివరించారు.
నోటుపై ఫిర్యాదు ఓటర్లను మభ్యపెట్టేందుకు ఏ పార్టీవారైనా కరెన్సీనోట్లు అందజేస్తే 044- 1950 ఫోన్ నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేయాలని ఆయన కోరారు.
Advertisement
Advertisement