మార్చి నుంచి మెట్రో సర్వీసు | Koyambedu-alanduru Metro services in March | Sakshi
Sakshi News home page

మార్చి నుంచి మెట్రో సర్వీసు

Published Sun, Dec 14 2014 3:14 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

మార్చి నుంచి మెట్రో సర్వీసు - Sakshi

మార్చి నుంచి మెట్రో సర్వీసు

 కోయంబేడు-ఆలందూరు మార్గంలో మెట్రోరైలు సర్వీసు 2015 మార్చి నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి సొరంగం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చెన్నై మహా నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా ఈ రైల్వే సేవలను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తయింది.    
 
 టీనగర్: చెన్నైలో వచ్చే ఏడాది మార్చి నెల నుంచి కోయంబేడు-ఆలందూరు మార్గంలో మెట్రోరైలు సర్వీసు ప్రారంభమౌతుందని మెట్రోరైలు ప్రాజెక్టు డెరైక్టర్ వెల్లడించారు. చెన్నైలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం సూచించే దిశగా 2007లో మెట్రోరైలు సర్వీసుకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీని ప్రకారం వాషర్‌మెన్‌పేట నుంచి విమానాశ్రయం వరకు, సెంట్రల్ నుంచి సెంట్ థామస్ మౌంట్ వరకు రెండు మార్గాల్లో రైలు నడిపేందుకు నిర్ణయించారు. దీనికి సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 36 కిలోమీటర్ల మేరకు సొరంగ మార్గం ఏర్పాటు చేసే పనుల్లో ఐదు సంస్థలు నిమగ్నమయ్యాయి. ఇందులో మొదటి విడతగా షెనాయ్‌నగర్ నుంచి అన్నానగర్ ఈస్ట్, అన్నానగర్ టవర్-తిరుమంగలం మధ్య 3 కిలోమీటర్ల దూరం రెండు మార్గాల్లో శనివారం ఉదయం 11.45 గంటలకు సొరంగం తవ్వే పను లు పూర్తయ్యాయి.
 
 దీని గురించి మెట్రోరైలు ప్రాజెక్టు డెరైక్టర్ రామనాధన్ విలేకరులతో మాట్లాడుతూ కోయంబేడు నుంచి ఆలందూరు వరకు ఫ్లై ఓవర్‌లో 10 కిలోమీటర్ల మేరకు పనులు పూర్తయ్యాయన్నారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్ల నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలి పారు. ఈ పనులన్నీ వచ్చే నెలలో పూర్తవుతాయన్నారు. ఫిబ్రవరిలో రైల్వే భద్రతాధికారి ట్రయల్ రన్ నిర్వహించేందు కు వస్తున్నట్లు తెలిపారు. దీంతో వచ్చే మార్చి నుంచి కోయంబేడు-ఆలందూ రు మధ్య మెట్రో రైలు పరుగులు తీయనుందని చెప్పారు. రెండో విడతగా సొరంగ మార్గంలో 2016 మార్చిలో అలందూరు-కోయంబేడు మీదుగా తిరుమంగళం, షెనాయ్‌నగర్, కీల్పాక్కం, ఎగ్మూరు వరకు రైలు నడిపేందు కు నిర్ణయించామని తెలిపారు. 2017 ప్రారంభంలో మెట్రోరైలు పనులు 45 కిలోమీటర్ల మేరకు పూర్తవుతాయని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ మార్గంలో 42 రైళ్లను నడిపేందుకు చర్య లు చేపట్టినట్లు తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement