నేటి నుంచి ‘స్థానిక’ ఎమ్మెల్సీ నామినేషన్లు
Published Tue, Feb 21 2017 12:13 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి లోకల్ అథారిటీ నియోజకవర్గం ఎన్నికలకు మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. జేసీ చాంబరులోనే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు సమర్పించవచ్చు. అభ్యర్థులు విధిగా ఆస్తులు, కేసులపై అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ల దాఖలుకు రిటర్నింగ్ అధికారి చాంబరులోకి అభ్యర్థి సహా అయిదుగురిని మాత్రమే అనుమతిస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5వేలు, ఇతరులు రూ.10వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంది. ఒక అభ్యర్థి డిపాజిట్‌పై నాలుగు సెట్ల నామినేషన్‌లు ఇవ్వవచ్చునని అసిస్టెంటు రిటర్నింగ్ అధికారి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించి.. మార్చి1న పరిశీలిస్తారు. మార్చి 3వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. మార్చినెల 17న పోలింగ్ జరుగుతుంది. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 1084 మంది ఓటర్లు ఉన్నారు.
Advertisement