కేటీపీపీ సీఈకి లోకాయుక్త నోటీసులు
Published Wed, Jul 27 2016 11:06 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
గణపురం : వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) సీఈ శివకుమార్‌కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. 24న హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న లోకాయుక్త కార్యాలయంలో హాజరు కావాలని రిజిస్ట్రార్ కె.నర్సింహారెడ్డి ఆదేశించారు. కేటీపీపీలో ఉద్యోగ నియామకాల్లో, క్యాజ్‌వల్ లేబర్ ఎంపికలో అధికారులు అవినీతికి పాల్పడ్డారని స్థానిక నిరుద్యోగులకు లోకాయుక్తకు జూన్ 17వ తేదీన ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్తా సంబంధిత అధికారులకు నోటీసులు పంపించింది. కేటీపీపీ అధికారుల వింత నిర్ణయాల మూలంగా ప్లాంట్‌లో స్థానికేతరులకు ఉద్యోగాలు లభించాయి. ముఖ్యంగా కేటీపీపీలో పనిచేసే అధికారుల బంధుజనంతో కేటీపీపీ నిండిపోయింది. ఇటీవల 420 జేపీఏ(జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్) ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. చాలా మంది అనర్హులు ఎంపికయ్యారని బాధిత నిరుద్యోగ యువకుడు సతీష్ లోకాయుక్తాను ఆశ్రయించాడు.
Advertisement