పట్టణంలో సంచలనం రేపిన లారీ ఓనర్ హత్యకేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
మిర్యాలగూడ: పట్టణంలో సంచలనం రేపిన లారీ ఓనర్ హత్యకేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. రెండు నెలల క్రితం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గుంటూరు జిల్లా జగ్గయ్యపేటకు చెందిన నెక్కొంటి సాయి ప్రసాద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు లారీ క్లీనర్ రామ్మోహన్‌రావే డబ్బు కోసం అతన్ని హతమార్చినట్లు నిర్థారించారు. దీంతో శనివారం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.