
ఆందోళన చేస్తోన్న దళిత సంఘాలు
నల్గొండ: ప్రేమ వివాహం చేసుకున్న దళిత యువకుడు హత్యకు గురికావడంతో దళిత సంఘాలు శనివారం మిర్యాలగూడ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. పట్టణంలోని వీధులలో దళిత సంఘాల నాయకులు శనివారం ఆందోళనలు నిర్వహించారు. హత్యకు కుట్ర పన్నిన మారుతీ రావు కఠినంగా శిక్షించాలని, ఆయన ఆస్తులను జప్తు చేసి బాధిత కుటుంబానికి అప్పగించాలని డిమాండ్ చేశారు.
టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత నాయకులు మేల్కొని ఉద్యమించాలని కోరారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మారుతీరావు ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే ప్రధాన నిందితుడు మారుతీ రావును హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కత్తితో హత్య చేసిన యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం ప్రణయ్ మృతదేహానికి నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment