మూగ జీవాలపై దూసుకెళ్లిన లారీ
20 గొర్రెలు మృతి.. 15కు గాయాలు ..
రూ. 4 లక్షల మేర నష్టం
ముండ్లమూరు: మండలంలోని పోలవరం వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డుపై వస్తున్న గొర్రెల మందపై లారీ దూసుకెళ్లడంతో 23 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా 15కు గాయాలయ్యూరుు. దీంతో నాలుగు లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయాడు. గుండూరు జిల్లా ముప్పరాజువారిపాలేనికి చెందిన ముప్పనేని వెంకటేశ్వర్లు, బొట్ల చిన సుబ్బయ్య, రావులపల్లి నరసయ్యలు గొర్రెల మందలను మేపుకొనేందుకు 40 రోజుల క్రితం జిల్లాలోని కారంచేడు, స్వర్ణ ప్రాంతాలకు వలస వెళ్లారు.
నాలుగు రోజుల క్రితం ఇక్కడ వర్షాలు పడటంతో తిరిగి స్వగ్రామానికి గొర్రెల మందతో వస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున పోలవరం వద్దకు రాగానే అనంతపురం నుంచి విజయవాడకు కీరదోసకాయల లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా గొర్రెలపైకి దూసుకుకెళ్లిది. ముప్పనేని వెంకటేశ్వర్లుకు చెందిన 11, బొట్ల చిన సుబ్బయ్య 7, రావులపల్లి నరసయ్యకు చెందిన 4 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా 15 గొర్రెలు గాయాలపాలయ్యాయి. నిద్రమత్తు వలనే ఈప్రమాదం చోటు చేసుకుందని డ్రైవర్ సీహెచ్ రమేష్ తెలిపాడు. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.