అధిక వర్షాలతో ఇవక పట్టిన పంటలు
పాచిపెంట : ఖరీఫ్ సీజన్‌లో పడిన ఆకాల వర్షాల వల్ల పత్తి పంటకు నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా అడపాదడపా కురుస్తున్న అకాల వర్షాల వల్ల చాలా వరకూ పత్తి పంటలతో పాటు మొక్కజొన్న పంటలకూ నష్టం వచ్చిందని చెబుతున్నారు. మండలంలో 2 వేలు హెక్టార్లలో పత్తి, 18 వందల హెక్టార్లలో మొక్కజొన్న పండిస్తున్నారనీ, వాటన్నింటికీ నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. మొక్కజొన్న పంట పూత దశలో ఉన్నప్పుడు పడిన అకాల వర్షాలవల్ల పూత రాలిపోయి చాలా వరకూ పంట దిగుబడులు తగ్గి పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్లపు ప్రాంతాలన్నీ ఇవక పట్టాయని... దానిని తగ్గించుకునేందుకు నానా పాట్లు పడాలని చెబుతున్నారు.