
ఆ దృశ్యం హృదయ విదారకం
అమరాపురం: అమరాపురం మండలం హల్కూరు గ్రామ మెయిన్ రోడ్డులో ట్రాక్టర్, బైక్ ఢీకొనడంతో యువకుడి కాలువిరిగా తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు ఆనంద్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. గుడిబండ మండలం చిగతుర్పికి చెందిన గొల్ల ఆనంద్ ఆదివారం ఉదయం బైక్‌లో చిగతుర్పి నుంచి కర్ణాటక రాష్ట్రం ఉవ్వినహళ్లికి బయలు దేరాడు. హల్కూరు మెయిన్ రోడ్డులో వస్తుండగా ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో ఆనంద్ ఎడమకాలి పాదం ట్రాక్టర్ ముందు భాగంలోని కుడి చక్రం కింద పూర్తిగా కట్ అయి చిక్కుకుంది.
వెంటనే 108కు సమాచారం అందించి, మడకశిర ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ మెరుగైన వైద్య సేవల కోసం బెంగళూరు ఆస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్ సూచించడంతో క్షతగాత్రుడి తండ్రి ఈరప్ప బెంగళూరుకు తీసుకెళ్లారు. సంఘటనతో ట్రాఫిక్‌కు గంటపాటు అంతరాయం ఏర్పడింది. ఎస్‌హెచ్‌ఓ మల్లేశ్వరప్ప, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.