కొత్తవలస: రైల్వేకి చెందిన మోటార్‌సైకిల్‌స్టాండులో మోటార్‌సైకిల్‌ను దొంగిలించిన వారిని పట్టుకుని మంగళవారం అరెస్టుచేసి కొత్తవలస కోర్టుకు తరలించినట్లు ఎస్‌ఐ కె.నీలకంఠం తెలిపారు. విశాఖపట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నెలరోజులక్రితం మండలంలో కంటాకలిల్లి గ్రామానికి వెళు్తండగా రైల్వేస్టేషన్‌వద్ద మెటార్‌సైకిల్ పార్కుచేసి వెళ్లారు.
తిరుగుప్రయాణంలో తమ మోటార్‌సైకిల్ కనిపించకపోవడతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి తాము వాహనాలు తనిఖీ చేస్తుండగా చేస్తుండగా మోటార్‌సైకిల్‌తో పాటు దొంగకూడా దొరికాడని తెలిపారు. మండలంలో అప్పన్నదొరపాలెంకు చెందిన జోడి గణేష్(19) దొంగతనానికి పాల్పడినట్లు తాముచేసిన దర్యాప్తులో తేలిందన్నారు. ఈ మేరకు అరెస్టుచేసి కొత్తవలస కోర్టులో హాజరుపరిచామన్నారు.
అగ్ని ప్రమాదాలపై అవగాహన
కొత్తవలస: పెట్రోల్ బంకుల్లో అగ్నిప్రమాదాలు జరిగితే తీసుకోవలసిన చర్యలు గురించి అగ్నిమాపక సిబ్బంది మంగళవారం అవగాహన కల్పించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న వాసవీ ఫిల్లింగ్‌స్టేషన్ వద్ద పెట్రోల్‌బంకులో పనిచేస్తున్న సిబ్బందికి అవగాహన కల్పించారు. పెట్రోల్‌బంకు పరిసరాలలో సిగరెట్లు తాగడం, సెల్‌ఫోన్లు వినియోగించరాదని తెలిపారు.బంకుల్లో ముందుజాగ్రత్త చర్యగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు.