
మెడికల్ ల్యాబ్‌లో ఘోరం
కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్ పట్టణంలోని అగ్రసేన్ భవన్ ముందు ఉన్న మెడికల్ ల్యాబ్‌లో సోమవారం రాత్రి ఒక యువతిపై అత్యాచార యత్నం జరిగినట్లు పట్టణ ఎస్సై ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఎస్సై ప్రభాకర్ రెడ్డి కథనం ప్రకారం.. పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన యువతీ (20) అగ్రసేన్ భవన్ ముందు ఉన్న సాయి రత్న క్లీనికల్ ల్యాబ్‌లో పని చేస్తోందని తెలిపారు. అదే ల్యాబ్‌లో ప్రైవేట్ టెక్నిషియన్‌గా పని చేస్తున్న కాగజ్‌నగర్ మండలం అందవెల్లి గ్రామానికి చెందిన మేకర్తి రవి సోమవారం రాత్రి యువతీపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఎస్సై తెలిపారు.
అయితే ఆ సమయంలో అమ్మాయి ప్రతిఘటించడంతో రవి యువతిపై చేయి చేసుకున్నాడని ఎస్సై వివరించారు. కేకలు వేయడంతో రవి అక్కడి నుండి పరారయ్యాడని, బాధితురాలు మంగళవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, మేకర్తి రవిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.