కర్నూలు : కర్నూలు జిల్లా సి.బెళగల్ గ్రామ శివారులో గుర్తు తెలియని యువకుని శవాన్ని శనివారం స్థానికులు కనుగొన్నారు. అనంతరం వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం పోస్ట్మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే శవం మాత్రం గుర్తుపట్టలేని విధంగా ఉందని పోలీసులు చెప్పారు. పోస్ట్మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.