ఓ వ్యాపారి తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ ఎస్పీకి వాట్సప్లో మెసేజ్ పెట్టాడు.
అనంతపురం: ఓ వ్యాపారి తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ ఎస్పీకి వాట్సప్లో మెసేజ్ పెట్టాడు. దీంతో పోలీసులు అతనికి కౌన్సిలింగ్ నిర్వహించారు.
అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. బీరే మెహన్ అనే వ్యక్తి పట్టుచీరల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే ఇటీవల అతను వ్యాపారంలో నష్టాలపాలై అప్పుల్లో కూరుకుపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి మోహన్.. ఎస్పీకి వాట్సప్ ద్వారా.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ మెసేజ్ చేశాడు. ఎస్పీ ఆదేశాలతో హుటాహుటిన కదిలిన పోలీసులు.. మోహన్ను కలుసుకొని ఆత్మహత్యకు పాల్పడొద్దంటూ కౌన్సిలింగ్ నిర్వహించారు.