అనంతపురం అర్బన్: ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులతో ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయిస్తోందని మెడికల్ కాంట్రాక్టు వర్కర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ మాణిక్యం ధ్వజమెత్తారు. జాతీయ కార్మిక సంఘాలు సెప్టెంబరు 2న తలపెట్టిన సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఐఎంఏ హాల్‌లో నిర్వహించిన సంఘం సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వకుండా ప్రభుత్వం దగా చేస్తోందని మండిపడ్డారు.
కాంట్రాక్టు వ్యవస్థని రద్దు చేసి కార్మికులకు ప్రభుత్వమే కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సి.జాఫర్, శకుంతలమ్మ, జె.రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు
Published Sun, Aug 7 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
Advertisement