ఖమ్మం: వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలాన్ని నూతన జిల్లాగా ప్రకటించనున్న భద్రాద్రి జిల్లాలో కలిపే ఆలోచనలో ప్రభుత్వం ఉండటంతో... మంగళవారం ఈ విషయమై ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్‌ను ఖమ్మంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
సుదూర ప్రాంతంలో ఉన్న జిల్లాకు కారేపల్లిని కలపటం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఉంటాయని, కారేపల్లిని ఖమ్మం జిల్లాలోనే ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతే కాకుండా వైరా రిజర్వాయర్ వద్ద నిర్మించిన బోడేపూడి సుజల స్రవంతి మంచినీటి పథకం అస్తవ్యస్థంగా ఉందని, నిర్వహణ సక్రమంగా లేకపోవటంతో నాలుగు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అవసరమైన చర్యలను తీసుకోవాలని విన్నవించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకుడు మచ్చా వెంకటేశ్వరరావు, మండేపుడి సత్యనారాయణ, కారేపల్లి మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు తదితరులున్నారు.
కారేపల్లిని ఖమ్మంలోనే ఉంచాలి
Published Wed, Jun 15 2016 10:36 AM | Last Updated on Thu, Mar 21 2019 7:27 PM
Advertisement