MLA Madan Lal
-
‘కారు’లో డిష్యుం.. డిష్యుం..!
కొణిజర్ల : ‘కారు’ హీటెక్కింది. టీఆర్ఎస్లో వర్గ పోరు మరోమారు బహిర్గతమైంది. వైరా నియోజకవర్గంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న టీఆర్ఎస్కు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయుల వర్గ పోరు బుధవారం ఒక్కసారిగా భగ్గుమన్నది. దీనికి.. పెద్దమునగాలలో రైతుబంధు చెక్కుల పంపిణీ సభ ‘వేదిక’గా మారింది. అసలేం జరిగిందంటే... బుధవారం, పెద్దమునగాలలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటైంది. షెడ్యూల్లో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ వస్తున్నట్టుగా లేదు. కానీ, మొదట ఎమ్మెల్యే మదన్‌లాల్ వచ్చారు. సభలో పాల్గొన్నారు. ఐదు నిముషాల తరువాత ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చారు. ముందుగా ఎమ్మెల్యే, ఆ తరువాత ఎంపీ ప్రసంగించారు. పెద్దమునగాలకు చెందిన మహిళలతో నాగలిని ఎంపీకి బహుకరించేందుకు కార్యకర్తలు సిద్ధమయ్యారు. మహిళలు ముందుకు వస్తున్నారు. అప్పటికే ఎమ్మెల్యే ఆదేశాలతో, రైతుబంధు చెక్కుల పంపిణీకి లబ్ధిదారులను వేదిక వద్దకు అధికారులు అదే సమయంలో పిలిచారు. ఎంపీ వర్గీయుడైన వైరా మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోసూరి శ్రీను, నేరుగా వేదిక వద్దకు వచ్చారు. మైక్ లాక్కున్నారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. దీనికి ఎమ్మెల్యే మదన్‌లాల్ అంగీకరించకుండా, మైకును కోనూరి శ్రీను నుంచి తీసుకునేందుకు ప్రయత్నించారు. అక్కడి నుంచి శ్రీను కదల్లేదు. దీంతో, ఎమ్మెల్యే వర్గీయులు వచ్చి ఆయనను పక్కకు నెట్టేశారు. శ్రీనుకు మద్దతుగా ఎంపీ వర్గీయులు కూడా వచ్చారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఒకరినొకరు తోసుకున్నారు. అరుపులు కేకలతో సభా ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. ఎంపీ, ఎమ్మెల్యే చూస్తుండగానే.. ఒకానొక దశలో కొట్టుకునేందుకు సిద్ధమయ్యారు. వైరా సీఐ మల్లయ్య స్వామి నేతృత్వంలో కొణిజర్ల, వైరా, తల్లాడ ఎస్ఐలు కలిసి పరిస్థితిని అదుపు చేశారు. అందరినీ బయటకు నెట్టేశారు. ఆ తరువాత, వేదిక పైనుంచి వాహనంలో బయటకు వెళుతున్న ఎమ్మెల్యే మదన్‌లాల్‌ను ఎంపీ వర్గీయులు అడ్డుకున్నారు. అక్కడ మరోసారి రెండు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. పరస్పరం నినాదాలు చేశారు. వారిని మరోసారి పోలీసులు చెదరగొట్టారు. చివరికి.. ఎమ్మెల్యే, ఎంపీ తమ తమ వాహనాలలో వెళ్లిపోయారు. ‘స్థానిక’ ఎన్నికలపై ప్రభావం ఉంటుందా..?! టీఆర్ఎస్కు చెందిన ఈ ఇద్దరు పెద్దల మధ్య దూరం, వారి వర్గీయుల మధ్య గొడవల ప్రభావం.. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఉంటుందా..?! ఇది, ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
రైతుల వద్దకే ‘రైతుబంధు’
కొణిజర్ల : రైతులు మాకు ఇక పంట సాయం వద్దు అని చెప్పే వరకు ప్రభుత్వం రైతు బంధు కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం కొణిజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని కొంత మంది రైతులకు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. అంతకు మందు ఏర్పాటు చేసిన సభలో రైతుల నుద్దేశించి ఆయన మాట్లాడుతూ రైతు పచ్చగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. అందుకే రైతులకు కరెంట్ ఇబ్బందులు తొలగించారన్నారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సకాలంలో రైతులకు వచ్చే విధంగా చేశామన్నారు. పండించిన పంటలను నిల్వ చేసుకునేందుకు 24 లక్షల టన్నుల సామర్ధ్యం కలిగిన గోడౌన్ల నిర్మాణం చేపట్టామన్నారు. పెట్టుబడి కోసం బ్యాంకుల చుట్టూతిరిగే పనిలేదు.. రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని పెట్టుబడి కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగకుండా ఉండేందుకే పంట సాయం అందించాలని నిర్ణయించి రైతు బంధు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. చరిత్రలో ఎక్కడా, ఏ దేశంలో లేదని అన్నారు. కృష్ణా జలాలు రాష్ట్రానికి వచ్చే పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో గోదావరి జలాలను జిల్లాకు మళ్లించి వైరా ప్రాంతంలో కొణిజర్ల మండల రైతులు 3 పంటలు పండించేలా సాగు నీరు అందించబోతున్నామన్నారు. వైరా ఎమ్మెల్యే బాణొత్ మదన్‌లాల్, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఖమ్మం ఆర్డీఓ తాళ్లూరి పూర్ణచంద్ర మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయసమితి మండల కోఆర్డినేటర్ దొడ్డపనేని రామారావు, జిల్లా సమితి సభ్యులు పాముల వెంకటేశ్వర్లు, డేరంగుల సునీత, గుత్తా వెంకటేశ్వరరావు, ఆత్మ చైర్మన్ బోడపోతుల వెంకటేశ్వర్లు, వైరా ఏఎంసీ చైర్మన్ బాణోత్ నరసింహారావు, ఎంపీపీ వడ్లమూడి ఉమారాణి, తహసీల్దార్ ఎం.శైలజ, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏఓ అరుణజ్యోతి, ఆర్ఐలు కొండలరావు, వినీల, వీఆర్ఓ భూక్యా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సాయాన్ని వదులుకున్న వినయ్‌కుమార్ .. తనకు వచ్చిన పెట్టుబడి సాయాన్ని రైతు సమన్వయసమితి సంక్షేమ నిధికి ఇస్తున్నట్లు కొణిజర్లకు చెందిన రైతు దొడ్డా వినయ్‌కుమార్ తన మామ కొమ్మినేని సత్యం ద్వారా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు లేఖ ఇచ్చారు. వినయ్ అమెరికాలో నివశిస్తున్నారు. ఆయనకున్న భూమికి గాను లభించిన రూ. 19,100 చెక్కును తిరిగి ఆయన తన మామ సత్యనారాయణ ద్వారా అధికారులకు అందజేశారు. దీంతో మంత్రి తుమ్మల ఆయనను అభినందించారు. జన్నారంలో ఎమ్మెల్యే చెక్కుల పంపిణీ కొణిజర్ల : రైతులు అప్పుల పాలు కాకూడదనే వారిని రుణబాధలు నుంచి విముక్తులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టి పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారని వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ అన్నారు. మండలంలోని జన్నారంలో శుక్రవారం రైతు బం«ధు చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బీడు భూములను సస్యశ్యామలం చేసి రైతు మోమున నవ్వు చూడాలన్నదే కేసీఆర్ ధ్యేయం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లు పూర్తతే రాష్ట్రం హరిత లెంలంగాణగా మారుతుందన్నారు. రూ 800 కోట్లు నీటి తీరువా రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ నారపోగు అరుణ, ఏఓ బాలాజీ, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడు గుత్తా వెంకటేశ్వరరావు, మండల కోఆర్డినేటర్ యండ్రాతి మోహనరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సక్రునాయక్, ఎంపీటీసీ సభ్యులు మేడా ధర్మారావు, నాయకులు గిద్దగిరి సత్యనారాయణ, మేడ రమేష్, కొమ్మూరి వెంకటేశ్వరరావు, వీఆర్ఓలు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
కారేపల్లిని ఖమ్మంలోనే ఉంచాలి
ఖమ్మం: వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలాన్ని నూతన జిల్లాగా ప్రకటించనున్న భద్రాద్రి జిల్లాలో కలిపే ఆలోచనలో ప్రభుత్వం ఉండటంతో... మంగళవారం ఈ విషయమై ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్‌ను ఖమ్మంలో కలిసి వినతిపత్రం అందజేశారు. సుదూర ప్రాంతంలో ఉన్న జిల్లాకు కారేపల్లిని కలపటం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఉంటాయని, కారేపల్లిని ఖమ్మం జిల్లాలోనే ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతే కాకుండా వైరా రిజర్వాయర్ వద్ద నిర్మించిన బోడేపూడి సుజల స్రవంతి మంచినీటి పథకం అస్తవ్యస్థంగా ఉందని, నిర్వహణ సక్రమంగా లేకపోవటంతో నాలుగు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అవసరమైన చర్యలను తీసుకోవాలని విన్నవించారు. ఆయన వెంట టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు మచ్చా వెంకటేశ్వరరావు, మండేపుడి సత్యనారాయణ, కారేపల్లి మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు తదితరులున్నారు. -
ప్రభుత్వం కూల్చివేతకు బీజేపీ కుట్ర: ఆప్
సాక్షి, న్యూఢిల్లీ: తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. తమ పార్టీకి పెరుగుతున్న ప్రతిష్ట చూసి బీజేపీ భయపడుతోందని, అందుకే అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొంది. ఢిల్లీ బీజేపీ సభాపక్షనేత హర్షవర్ధన్, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ, ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ తమ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆప్ నేత సంజయ్‌సింగ్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బీజేపీ తమ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతోందన్నారు. ప్రభుత్వాన్ని పడగ్టొటడం కోసం బీజేపీ తనను మూడుమార్లు సంప్రదించిందని కస్తూరిబానగర్ ఎమ్మెల్యే మదన్‌లాల్ ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు వెలువడకముందు నుంచే తనతో బేరసారాలు మొదలయ్యాయని చెప్పారు. ‘ఎన్నికల ఫలితాల వెలువడడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు అంటే.. డిసెంబర్ ఏడు అర్ధరాత్రి రాత్రి 12.30 గంటలకు నాకు ఐఎస్డీ కాల్ వచ్చింది. మరుసటి ఉదయం అరుణ్‌జైట్లీతో మాట్లాడిస్తానని కాలర్ చెప్పాడు. నేను ‘షటప్’ అని ఫోన్ పెట్టేశాను. తరువాత రెండు రోజులకు.. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకమునుపు నన్ను సంప్రదించిన వ్యక్తి మళ్లీ మాట్లాడాడు. ఆప్‌కు ఎలాగూ మెజారిటీ లేదు కాబట్టి తమకు మద్దతు ఇస్తే ఏది కావాలంటే అది ఇస్తామని అన్నాడు. తాజాగా పది రోజుల కిందట ఇద్దరు వ్యక్తులు నా దగ్గరికి ఇద్దరు వచ్చారు. వారిలో ఒకరు తనకు పరిచయస్తుడు కాగా మరొకరు నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకున్నాడు. తొమ్మిది మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని కూల్చవలసిందిగా కోరాడు’ అని మదన్ లాల్ వివరించారు. ఇందుకు ప్రతిఫలంగా తనను ముఖ్యమంత్రిని, మిగతావారిని మంత్రులను చేస్తాననిప్రతిపాదించాడని, బీజేపీ తమ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందన్నాడని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కావాలనుకునేవారికి 20 కోట్ల రూపాయలు కేబినెట్ మంత్రులకు 10 కోట్ల రూపాయలు ఇస్తానని ప్రతిపాదించాడని కూడా వివరించారు. ఈ ఆరోపణలను నిరూపించే సాక్ష్యాధారాలు తనవద్ద లేవని మదన్‌లాల్ చెప్పారు. బిన్నీతో తాను చేతులు కలిపినట్లు మీడియా దుష్ర్పచారం చే స్తోందని ఆరోపించారు. ఈ అసత్య ప్రచారాన్ని ఖండించడానికే తాను బీజేపీ బేరసారాలను బయటపెట్టినట్లు మదన్‌లాల్ చెప్పారు. బీజేపీ బేరసారాల గురించి పార్టీకి వెల్లడించినట్టు ఆయన చెప్పారు. తాను బిన్నీతో సమావేశం కాలేదన్నారు. మీడియా సంస్థలకు కూడా పాత్ర ఉంది ఆప్ నుంచి బహిష్కృతుడైన ఎమ్మెల్యే వినోద్‌కుమా ర్ బిన్నీ, బయట నుంచి ప్రభుత్వానికి మద ్దతు ఇస్తు న్న ఇద్దరు ఎమ్మెల్యేలు షోయబ్ ఇక్బాల్, రామ్‌బీర్ సింగ్ షౌకీన్ ప్రభుత్వానికి 48 గంటల అల్టిమేటం ఇవ్వడంతో ఆప్ అప్రమత్తమయింది. సోమవారం ఉదయం పార్టీ నేతలు సంజయ్‌సింగ్ ఆశుతోష్, ఎమ్మెల్యే మదన్‌లాల్ మీడియా సమావేశం ఏర్పా టు చేసి బీజేపీపై మండిపడ్డారు. కొన్ని మీడి యా సంస్థలకు కూడా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగస్వామ్యం ఉందని ఆప్ ఆరోపించింది. ఈ కుట్రలను ప్రజల ముందుకు తేవడానికి మంగళవారం నుంచి ‘పోల్ ఖోల్ అభియాన్’ చేపట్టనున్న ట్లు ఆప్ ప్రకటించింది. ఈ ప్రచారోద్యమం ద్వారా కాంగ్రెస్, బీజేపీ గుట్టురట్టు చేస్తామని ఆప్ ప్రకటించింది.ఆప్ సర్కారును కూల్చడానికి జరుగుతోన్న కుట్ర వెనుక అదానీ, అంబానీ హస్తం కూడా ఉందని సంజయ్ సింగ్ ఆరోపించారు. డిస్కమ్‌ల లెసైన్సులు రద్దు చేస్తానని కేజ్రీవాల్ హెచ్చరించిన రోజు నుంచి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు ఊపందుకున్నాయని ఆరోపించారు. కరెంటు సంక్షోభం గురించి ప్రభుత్వానికి సమాచారం అందకమునుపే బీజేపీ నిరసన ప్రదర్శనలు మొదలుపెట్టిందని సంజయ్ అన్నారు. బిన్నీ బీజేపీతో చేతులు కలిపారని ఆయన ఆరోపించారు. నిజమేనా ?: కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ విలేకరుల సమావేశాన్ని నిర్వహించడానికి ముప్పావుగంటల ముందు ఢిల్లీ కాంగ్రెస్ ఇన్చార్జ్ షకీల్ అహ్మద్ ఆప్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ చేస్తోన్న ప్రయత్నాల గురించి ట్వీట్ చేశారు. ‘బీజేపీకి సన్నిహితంగా ఉండే కోటీశ్వరుడైన పారిశ్రామిక ఆప్ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నిస్తున్నారట. ఆప్‌కు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలతో రాజీనామాలు ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇది నిజమేనా ?’ అని ట్వీట్ చేశారు. ఆరోపణలను ఖండించిన బీజేపీ తమ సర్కారును కూల్చివేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఆప్ చేసిన ఆరోపణలను ఆ పార్టీ ఖండించింది. ఇవి నిరాధారమైన, అర్థంపర్థంలేని ఆరోపణలని బీజేపీ నేత అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు. ప్రత్యామ్నాయం అందిస్తామని ఆప్ చెప్పిన మాటలు అసత్యాలని పేర్కొన్నారు. ఆప్ ఆరోపణలు నిరాధారమని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజయ్ గోయల్ చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనుకుంటే బీజేపీ పార్టీలను విభజించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేదని ఆయన అన్నారు. ఆప్ నేతల సర్టిఫికెట్ అమకు అవసరం లేదని, ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే డిసెంబర్ ఎనిమిది నాడే ఆ పనిచేసి ఉండేవాళ్లమన్నారు.