
పార్టీ మారను.. కొడంగల్ వీడను
వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీలతో కలిపి మహాకూటమి ఏర్పాటు చే సి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె.........
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి
కొడంగల్ : వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీలతో క లిపి మహాకూటమి ఏర్పాటు చే సి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నా రు. గురువారం రాత్రి విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడు తూ పలు విషయాలు వెల్లడిం చారు. టీడీపీ మారుతానని తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. పార్టీ మారేది లేదు.. కొడంగల్‌ను వీడేది లేదన్నారు. తనపై నమ్మకం ఉంచి రెండుసార్లు గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. 2019లో కొడంగల్ నుంచి మూడోసారి పోటీచేసి హాట్రిక్ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ తరఫున రాష్ట్ర ఏర్పాటులో పాల్గొన్న ఉద్యమకారులకు, యువతకు టికెట్లు ఇస్తామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డికి టికెట్ ఇవ్వాలని సవాల్ విసిరారు. కేసీఆర్ తనపై రాజకీయంగా దాడి చేయడానికి కుట్రలు పన్నుతున్నారని, నిత్యం తనను తాను కాపాడుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. గతంలో అభివృద్ధి మాట తెలియని ఈ ప్రాంతంలో తా ను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే రోడ్డు విస్తరణతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, అధికారం తన చేతికి వస్తే ఈ ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.