తమ రెక్కల కష్టాన్నే నమ్ముకుని జీవిస్తున్న అన్నదాతలను వేధించే బ్యాంకర్లపై దాడులు తప్పవని అంచనాల కమిటీ చైర్మన్,
బ్యాంకర్లకు ఎమ్మెల్యే సోలిపేట హెచ్చరిక
దౌల్తాబాద్: తమ రెక్కల కష్టాన్నే నమ్ముకుని జీవిస్తున్న అన్నదాతలను వేధించే బ్యాంకర్లపై దాడులు తప్పవని అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హెచ్చరించారు. మంగళవారం మెదక్ జిల్లా దౌల్తాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు పెట్టిన పెట్టుబడితో వచ్చిన లాభాలనే జీతాలు తీసుకునే బ్యాంకర్లు వారిపై దురుసుగా ప్రవర్తించడం సరికాదన్నారు. బ్యాంకర్ల వ్యవహార శైలి వల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.