కొత్త రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని, యువత పారిశ్రామిక రంగం వైపు అడుగులు వేయాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు అన్నారు. కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌కాలనీలో సిమ్‌సన్ లైఫ్ సెన్సైస్ డెవలప్, రీసెర్చ్ సెంటర్‌ను ఆదివారం కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే కష్ణారావు మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యానిచ్చే మందులను రీసెర్చ్‌లో కనుగొన్నాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు కావాలని, పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిసిఏ అసిస్టెంట్ డెరైక్టర్ యోగానందం, జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ కమీషనర్ సురేంద్రమోహన్, కూకట్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ జూపల్లిసత్యనారాయణ, సంస్థ ఎండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.