మదర్ థెరిస్సా ఆశయాలను కొనసాగిద్దాం
– కర్నూలు, అనంతపురం డయాసిస్ బిషప్ పూల ఆంతోని
కర్నూలు సీక్యాంప్: మధర్‌థెరిస్సా ఆశయాలను కొనసాగిద్దామని కర్నూలు, అనంతపురం డయాసిస్ బిషప్ పూలఆంతోని పిలుపునిచ్చారు. సోమవారం మాధవనగర్‌లోని లూర్ధుమాత దేవాలయంలో మధర్‌థెరిస్సా పట్టాభిషేకోత్సవ కార్యక్రమం జరిగింది. బిషప్ పూల ఆంతోని మాట్లాడుతూ.. మదర్‌థెర్సిస్సా సేవలు మరువలేనివన్నారు. శాంతి, ప్రేమ, జాలి, కరుణ, దయలను ఆయుధాలుగా చేసుకుని ప్రపంచాన్ని మార్చడానికి థెరిస్సా కృషి చేశారన్నారు. మదర్‌కు పునీత పట్టం ప్రకటించిన వాటికన్ సిటీకి కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం సీక్యాంప్ సెంటర్ నుంచి చెక్‌పోస్ట్‌వరకు ర్యాలీ నిర్వహించారు.