
'ఆమరణ దీక్ష విషయంలో ఎలాంటి మార్పు లేదు'
కాకినాడ: తన చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్ష విషయంలో ఎలాంటి మార్పు లేదని కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. గురువారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసంలో టీడీపీ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, బోండా ఉమా, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు భేటీ ముగిసింది. అనంతరం ముద్రగడ విలేకర్లతో మాట్లాడారు.
రేపు ఉదయం 9.00 గంటలకు దీక్షకు కూర్చుంటున్నట్లు ఆయన తెలిపారు. నా ఆమరణ దీక్షకు అడ్డుతగలొద్దని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తుని ఘటనపై అవసరమైతే సీబీఐ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనలో అమాయకులపై మాత్రం తప్పుడు కేసులు పెట్టొద్దని ప్రభుత్వాన్ని ముద్రగడ కోరారు.