‘చిన్నారులని చూడ లేదు.. పోనిలే పాపం అనుకోలేదు.. పెరట్లోని చెట్టు ఉసిరికాయలు కోస్తున్న ఇద్దరు చిన్నారులను ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు చితకబాదారు. విద్యార్థుల వీపుపై తట్లు తేలిపోయాయి’అంటూ వారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. స్థానిక
-
ఆప్కో డైరెక్టర్ ముప్పనపై పోలీసులకు ఫిర్యాదు
పెద్దాపురం :
‘చిన్నారులని చూడ లేదు.. పోనిలే పాపం అనుకోలేదు.. పెరట్లోని చెట్టు ఉసిరికాయలు కోస్తున్న ఇద్దరు చిన్నారులను ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు చితకబాదారు. విద్యార్థుల వీపుపై తట్లు తేలిపోయాయి’అంటూ వారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. స్థానిక వ్యాపారపుంతకు చెందిన తురుపూడి శ్రీను కుమారులు తరుణ్ హర్ష శివాలయం వీధి లోని లెమ్స్ ఇంగ్లిష్ మీడి యం స్కూల్‌లో 6, 4వ తరగతి చదువుతున్నారు. గురువారం వారు భోజనానికి ఇంటికి దగ్గర దారి ముప్పన బంగ్లా నుంచి వెళ్లారు. దారిలో ఉన్న ఉసిరి చెట్టు కింద ఉన్న ఉసిరికాయలు వెదుకుతూ, చెట్టుపై వాటిని కోస్తూ.. వీర్రాజు దృష్టిలో పడ్డారు. ఆగ్రహించిన ఆయన ఆ చిన్నారులను చితకబాదారు. వారు ఏడుస్తూ ఇంటికి వెళ్లారు. వారి తల్లిదండ్రులు శ్రీను, వరలక్ష్మి స్థానిక పోలీస్ స్టేష¯ŒSలో ఈమేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. ఈ విషయంపై ఎస్సై సతీష్‌ను వివరణ కోరగా విద్యార్థులను వీర్రాజు దారుణంగా కొట్టారన్న ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేస్తానన్నారు.
మందలించానంతే..
స్కూల్‌లో ఉండాల్సిన సమయంలో పెరట్లో పనేంటని ఆ విద్యార్థులను మందలించాను. వారి ఐడీ కార్డుపై ఫో¯ŒS నెంబర్ చూసి తల్లిదండ్రులుకు సమాచారం ఇచ్చా. కావాలనే నాపై బురద జల్లుతున్నారు. నేను ఒక అబ్బాయిని మందలిస్తే ఇద్దరికి వాతలు పడ్డాయంటూ ప్రచారం చేయడం బాధాకరంగా ఉంది.
– ముప్పన వీర్రాజు, ఆప్కో డైరెక్టర్, పెద్దాపురం