నారాయణగిరి క్షేత్రం వేంకటేశ్వరస్వామి ఆలయం భక్త జనసంద్రంగా మారింది. ఆలయంలో మంగళవారం నుంచి జరుగుతున్న కార్యక్రమాలు శుక్రవారానికి మూడో రోజుకు చేరాయి. చినజీయర్‌స్వామి ఆలయానికి వచ్చి వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు
-
ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించిన చినజీయర్‌స్వామి
రంపచోడవరం :
నారాయణగిరి క్షేత్రం వేంకటేశ్వరస్వామి ఆలయం భక్త జనసంద్రంగా మారింది. ఆలయంలో మంగళవారం నుంచి జరుగుతున్న కార్యక్రమాలు శుక్రవారానికి మూడో రోజుకు చేరాయి. చినజీయర్‌స్వామి ఆలయానికి వచ్చి వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముహూర్త సమయానికి మేళాతాళాల మధ్య ధ్వజస్తంభ అవరోహణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం భక్తులనుద్దేశించి జీయర్‌స్వామి మాట్లాడారు. రంపచోడవరంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారని హిందూధర్మ పరిరక్షణకు ఇదో తార్కాణమన్నారు. గుడి నిర్మాణంలో ఎంతో కృషి చేసిన సాదిక్‌మాస్టార్‌ను ఆయన అభినందించారు. భక్తులు సనాత హిందూ సంప్రదాయాన్ని పరిరక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమల ఆలయ అధికారి వేండ్ర త్రినాథరావు, దేవాదాయశాఖ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ అజాద్ తదితరులు పాల్గొన్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి శుక్రవారం ఉదయం చిన్నజీయర్‌స్వామివారిని కలిసి ఆయన ఆశీస్సులు పొందారు. శుక్రవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పోటెత్తారు.