ప్రకృతిని అధ్యయనం చేసి అద్భుతాలు సృష్టిద్దాం..
ఏఎన్‌యూ : ప్రకృతిలో జీవరాశికి సంబంధించిన ఎన్నో విశిష్టతలున్నాయని, ప్రకృతిని అధ్యయనం చేసి అద్భుతాలు సృష్టించాలని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు పేర్కొన్నారు.
-
ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ఆచార్య నాగేశ్వరరావు
ఏఎన్‌యూ : ప్రకృతిలో జీవరాశికి సంబంధించిన ఎన్నో విశిష్టతలున్నాయని, ప్రకృతిని అధ్యయనం చేసి అద్భుతాలు సృష్టించాలని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఏపీ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలో నవంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు విజయవాడలో జరగనున్న ఏపీ సైన్స్ కాంగ్రెస్ బ్రోచర్ ఆవిష్కరణ, సైన్స్ పాపులరైజేషన్ ప్రోగ్రాంపై సదస్సును బుధవారం యూనివర్సిటీలో నిర్వహించారు. బ్రోచర్ ఆవిష్కరించాక ‘ఇన్‌సె్పౖర్డ్ సింథసీస్ ఆఫ్ నానో మెటీరియల్స్’ అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. విద్యార్థులు, పరిశోధకులు ల్యాబ్‌లకే పరిమితమై సమయాన్ని వృథా చేసుకోవద్దని, సహజ సిద్ధమైన వాటిపై పరిశోధనలు చేయాలని సూచించారు. ప్రస్తుతం మెడిసిన్, సర్జరీ తదితర అన్ని అంశాల్లో నానో మెటీరియల్స్ కీలకంగా మారినట్లు తెలిపారు. కృష్ణా యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.రామకృష్ణారావు మాట్లాడుతూ వేల సంవత్సరాల కిందటే భారతీయులు ప్రపంచానికి గొప్ప సైన్స్, విద్య, నాగరికతను అందించినట్లు తెలిపారు. సైన్స్ తదితర రంగాల్లో ప్రపంచంలో భారతీయుల గొప్పతనాన్ని చాటేలా విద్యార్థులు, పరిశోధకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏఎన్‌యూ వీసీ ఆచార్య ఎ.రాజేంద్రప్రసాద్, రెక్టార్, ఏపీ అకాడమీ ఆఫ్ సైన్సెస్ గౌరవ కార్యదర్శి ఆచార్య కేఆర్‌ఎస్ సాంబశివరావు, కార్యనిర్వాహక కార్యదర్శి ఆచార్య ఏవీ బసవేశ్వరరావు, ఏఎన్‌యూ రిజిస్ట్రార్ ఆచార్య కె.జాన్‌పాల్, ఓఎస్‌స్‌డీ ఆచార్య దత్తాత్రేయరావు, సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆచార్య బి.విక్టర్‌బాబు, మాజీ ప్రిన్సిపాల్ ఆచార్య సి.రాంబాబు తదిరతులు ప్రసంగించారు. పలువురు అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.