సిద్దిపేటలో మోగిన ఎన్నికల నగారా | nomination adption today in medak dist for election | Sakshi
Sakshi News home page

సిద్దిపేటలో మోగిన ఎన్నికల నగారా

Published Mon, Mar 21 2016 2:38 AM | Last Updated on Fri, Jul 26 2019 5:59 PM

సిద్దిపేటలో మోగిన ఎన్నికల నగారా - Sakshi

సిద్దిపేటలో మోగిన ఎన్నికల నగారా

విడుదలైన షెడ్యూల్
నేడు నోటిఫికేషన్ జారీ
నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ
ఏప్రిల్ 6న పోలింగ్, 11న కౌంటింగ్
వివరాలు వెల్లడించిన కలెక్టర్ రోనాల్డ్ రాస్

సంగారెడ్డి జోన్/ సిద్దిపేట బృందం: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలకు ఎట్టకేలకు నగారా మోగింది. న్యాయపరమైన అడ్డం కులు తొలగిపోవడంతో ఎన్నికల నిర్వహణకు ఆదివారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 6న ఎన్నికల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. సోమవారం నోటిఫికేషన్ జారీ కానుంది. నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణం నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆదివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ రోనాల్డ్ రాస్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ గురించి వివరించారు. ఈ ఎన్నికలకు మున్సిపల్ కమిషనర్  రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. సోమవారం నుంచి 23వ తేదీ వరకు ఉదయం 11 నుంచి

 వార్డుల వారీగా రిజర్వేషన్లు ఇలా...
మొత్తం 34 వార్డులకు గాను ఆయా వార్డులు పలు వర్గాలకు రిజర్వు అయ్యాయి. ఇందులో ఎస్టీ (జనరల్)కు 22వ వార్డు,  ఎస్సీ (మహిళ)కు 6వ వార్డు, ఎస్సీ (జనరల్)కు 11వ వార్డు కేటాయించారు. బీసీ (మహిళ)కు 25, 27, 28, 31, 34 వార్డులు,

బీసీ (జనరల్)కు 1, 7, 24, 26, 32, 33వ వార్డులు, మహిళ (జనరల్)కు 2, 3, 4, 5, 9, 15, 18, 19, 21, 23, 29వ వార్డులు రిజర్వు అయ్యాయి. కాగా 8, 10, 12, 13, 14, 16, 17, 20, 30వ వార్డులు అన్‌రిజర్వుడ్‌గా కేటాయించారు.

మధ్యాహ్నం 3 వరకు నామినేషన్లు స్వీకరిస్తామరు. ఈనెల 24న పరిశీలన ఉంటుంది. 25వ తేదీనమధ్యాహ్నం 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అదే రోజు బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు. ఏప్రిల్ 6న పోలింగ్ జరుగుతుంది. 11వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.

 నామినేషన్లకు ప్రత్యేక కౌంటర్లు...
నామినేషన్ల దాఖలుకు పట్టణంలోని 34 వార్డులకు గాను 34 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఒకటి నుంచి 15వ వార్డు వరకు మున్సిపల్ కార్యాలయంలో, 16, 17వ వార్డులకు రెవెన్యూ గెస్ట్‌హౌస్‌లో, 18 నుంచి 34వ వార్డు వరకు పాత ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు.

 84 పోలింగ్ కేంద్రాలు..
మున్సిపల్ పరిధిలో 88,982 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందుకు 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించనున్నారు. రీపోలింగ్ జరపాల్సి వస్తే ఏప్రిల్ 9న నిర్వహిస్తారు.

 కెమెరాలతో నిఘా...
పోలింగ్ ప్రక్రియ వెబ్ కెమెరా నిఘాలో కొనసాగనుంది. పట్టణంలోని 43 భవనాల్లో వీడియోగ్రఫీని ఏర్పాటు చేసి 84 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కెమెరాలను అందుబాటులోకి తేనున్నారు. ఎన్నికల నిర్వహణలో 505 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారు. 8మంది జోనల్, 8మంది రూట్ అధికారులను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 22 అత్యంత సున్నిత, 35 సున్నితమైన కేంద్రాలను గుర్తించారు. ఆయా కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు. వీరికి రెండుసార్లు శిక్షణ ఇవ్వనున్నారు.

 వార్డుకో అసిస్టెంట్ ఎన్నికల అధికారి
పట్టణంలోని 34 వార్డులకు గాను ప్రతి వార్డుకు ఒక అసిస్టెంట్ ఎన్నికల అధికారి నియమించారు. అభ్యర్థులు తమ నామినేషన్లను వారికి అంద జేయాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్ కేవలం సిద్దిపేట మున్సిపల్ పరిధికి మాత్రమే వర్తించనుంది.

 హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు
ఆయా వార్డుల నుంచి కౌన్సిలర్లుగా పోటీ చేసే అభ్యర్థులకు సమగ్ర సమచారాన్ని అందించడానికి మూడు కేంద్రాల్లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయనున్నారు. మొదటగా నామినేషన్లను పూరించడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభ్యర్థులకు ఈ హెల్ప్‌డెస్కులు సమగ్ర సమాచారాన్ని అందించనున్నాయి. ముఖ్యంగా నామినేషన్ వేసే వారు తమ వెంట ఇద్దరిని మాత్రమే కేంద్రంలోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement