జెడ్పీ అంటే లెక్కలేదా? | officers neglect zp meet | Sakshi
Sakshi News home page

జెడ్పీ అంటే లెక్కలేదా?

Published Fri, Oct 28 2016 10:56 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM

జెడ్పీ అంటే లెక్కలేదా?

జెడ్పీ అంటే లెక్కలేదా?

- అధికారుల గైర్హాజరుపై జెడ్పీ చైర్మన్‌ ఆగ్రహం
 కర్నూలు సిటీ: జిల్లా పరిషత్‌ స్థాయి సంఘాల సమావేశం అంటే అధికారులకు లెక్కలేకుండా పోతోందని జెడ్పీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌ మండిపడ్డారు. శుక్రవారం జెడ్పీ స్థాయి సంఘాల సమావేశం చైర్మెన్‌ చాంబర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ జెడ్పీలో  సమావేశాలు జరుగుతున్నాయంటే కొంత మంది అధికారులకు హాజరుకావడం ఇబ్బందిగా ఉన్నట్లు ఉందన్నారు. వారం, పది రోజుల ముందుగానే  సమావేశాల గురించి తెలియజేసినా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సమావేశానికి ఆర్‌డబ్ల్యూఎస్‌, జల వనరుల శాఖ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈలు, మైనర్‌ ఇరిగేషన్‌ నంద్యాల, కర్నూలు ఈఈలు,  పీఆర్‌ ఈఈ నంద్యాల, ఐటీడీఏ పీఓ, యస్‌యస్‌ఏ పీఓ, వైద్య, ఆరోగ్య శాఖ అ«ధికారి, పెద్దాసుపత్రి పర్యవేక్షకులు, డీడీ సోషల్‌ వెల్ఫర్, బీసీ కార్పొరేషన్‌ ఈడీ, హౌసింగ్‌ పీడీ, అగ్రోస్, ఏపీ సీడ్స్‌ మేనేజర్లు, ఎండోమెంట్‌ డిప్యూటీ కమీషన్, ఫారెస్ట్‌ అ«ధికారులు గైర్హాజరయ్యారు.  సమావేశానికి మంత్రాలయం, ఆదోని ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్‌ రెడ్డి, జడ్పీ సీఈఓ బిఆర్‌.ఈశ్వర్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అ«ధికారులు హాజరయ్యారు. వ్యవసాయానికి 12 గంటల పాటు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని తీర్మానం చేశారు. దీంతో పాటు జెడ్పీకి సంబంధించిన రూ. 252 కోట్ల పనులకు ఆమోద ముద్ర వేశారు. 
 
సమావేశంలో చర్చకు వచ్చినవి ఇలా...!
– ఆర్టీసీ బస్సులు చాలా గ్రామాల్లో వేళకు రావడం లేదనే పిర్యాదులు వస్తున్నాయని, గువ్వకుంట్లకు రెండు నెలలుగా బస్సు సర్వీస్‌ నిలిపి వేవారని, పునరుద్ధరించాలని కొత్తపల్లి జడ్పీటీసీ పురుష్తోతం రెడ్డి ఆర్టీసీ ఆర్‌ఎంను కోరారు.
– కార్తీక మాసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని, 31వ తేదీ నుంచి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసపుకోవాలని జడ్పీ సీఈఓ బిఆర్‌ ఈశ్వర్‌ సూచించారు.
– సీపీడబ్ల్యూఎస్‌లు ప్రత్యేక కమిటీల ద్వారా నిర్వహిస్తున్నామని, చేతి పంపుల నిర్వహణకు ఒక్కోదానికి రూ. 1000 చొప్పు డిపాజిట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.
– వేలు గుర్తులు పడని వారికి కూడ రేషన్‌ సరుకులు వేసేలా చర్యలు తీసుకోవాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కోరారు.
– ఉపాధి పనులు గుర్తించేందుకు ఫీల్డ్‌ అసిస్టెంట్లను నియమించాలని, వారు లేకపోవడంతో చాలా చోట్ల పనులు జరుగడం లేదని ఎమ్మెల్యే గౌరు చరితా డ్వామా పీడీ పుల్లారెడ్డిని కోరగా, స్పందించి 15 రోజుల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్ల నియమాక ప్రక్రియ మొదలు పెడతామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement