‘రాజు’గారి చెరలో.. | On agricultural land | Sakshi
Sakshi News home page

‘రాజు’గారి చెరలో..

Dec 28 2016 1:06 AM | Updated on Jun 4 2019 5:16 PM

‘రాజు’గారి చెరలో.. - Sakshi

‘రాజు’గారి చెరలో..

వ్యవసాయ భూమి అని అడ్డుచక్రం తప్పుడు పాస్‌పుస్తకాలతో మాయాజాలం నేడు అదే ప్లాట్ల కొనుగోలుకు మంత్రాంగం

నాడు వ్యవసాయ భూమి అని అడ్డుచక్రం తప్పుడు పాస్‌పుస్తకాలతో మాయాజాలం నేడు అదే ప్లాట్ల కొనుగోలుకు మంత్రాంగం వ్యవహారం కోర్టులో ఉన్నా బేఖాతరు రాజు తలచుకుంటే కానిదేముంటుంది.. తిమ్మిని బమ్మిని చేయగలరు.. ఒప్పును తప్పుగా చూపించగలరు.. కావాలనుకుంటే.. మళ్లీ ఆ తప్పునే ఒప్పుగా మార్చేయగలరు.. సబ్బవరం మండలంలో విశ్రాంత ఉద్యోగులు జీవితకాల కష్టార్జితంతో కొనుక్కున్న ప్లాట్ల విషయంలో ఓ ‘రాజు’గారు ఆడుతున్న కబ్జా క్రీడ ఇదే చెబుతోంది..

కొన్నేళ్ల క్రితం రైతుల నుంచి జీపీఏ తీసుకొని వేసిన లే అవుట్‌లో వందలాది మంది ప్లాట్లు కొంటే.. వాటిని కాజేసేందుకు తప్పుడు పాస్‌పుస్తకాలు సృష్టించారు. వ్యవసాయ భూమి అంటూ అడ్డు చక్రం వేశారు.. దానిపై కొనుగోలుదారులు కోర్టు కెళ్లారు.. వ్యవహారం అక్కడే ఉంది..అయినా ఖాతరు చేయకుండా సదరు ‘రాజు’గారు తన అనుచరుల పేరిట తక్కువ ధరకు వాటిని చేజిక్కించుకునేందుకు చక్రం తిప్పుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement