నో చెలా‘మనీ’ | On November 8, the old Rs 500, Rs 1,000 notes Cancel | Sakshi
Sakshi News home page

నో చెలా‘మనీ’

Published Fri, Nov 25 2016 2:56 AM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM

నో చెలా‘మనీ’ - Sakshi

నో చెలా‘మనీ’

నిజామాబాద్ అర్బన్ :  కేంద్ర ప్రభుత్వం షాక్‌ల మీద  షాక్‌లు ఇస్తోంది. నవంబర్ 8న పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సర్కారు.. వ్యాపారంలో అవవసరం కోసం పాతనోట్లను గురువారం వరకు తీసుకోవచ్చని ప్రకటించింది. కేంద్ర నిర్ణయం ముగియడంతో బ్యాంక్ కౌంటర్లలో కూడా తీసుకోవద్దని కేంద్రం ప్రకటించింది. బ్యాంకు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం మాత్రం కల్పించినట్లు సమాచారం. పక్షం రోజులుగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నోట్ల మార్పిడికి బ్యాంకులు, ఏటీఎంల ఎదుట బారులు తీరారు. మరోవైపు పాతనోట్లు రద్దు చేయడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రూ.850 కోట్ల మార్పిడి జరిగింది. ఆర్‌బీఐ నుంచి ఇప్పటి వరకు రూ.410 కోట్లు వచ్చారుు. సామాన్యులు నోట్ల మార్పిడి కోసం పాట్లు పడుతుండగా.. పెద్దలు మాత్రం అంతర్గతంగా కొత్తపాత నోట్ల మార్పిడిలు పర్సంటేజీలలో జోరుగా కొనసాగుతోంది.

గంటల్లోనే ఏటీఎంలు ఖాళీ
నోట్ల రద్దు ఫలితంగా ఏటీఎంల ఎదుట వినియోగదారులు బారులు తీరడంతో ఏటీఎంల్లో డబ్బులు గంటల్లో ఖాళీ అవుతున్నారుు. జిల్లాలో 336 బ్యాంకులు ఉన్నారుు. వీటి పరిధిలో 338 ఏటీఎంలు ఉన్నారుు. ఒక్కో రోజు ఒక్క ఏటీఎంలో రూ.2.50 లక్షలు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుతం నోట్ల రద్దు నేపథ్యంలో రెండుసార్లు ఏటీఎంలలో డబ్బులు అందుబాటులో ఉంచుతున్నారు. ఒక్క ఏటీఎంలో రోజుకు రూ.5 లక్షలు పెడుతున్నా సరిపోవడం లేదు. డబ్బుల కోసం వినియోగదారులు పోటీపడుతున్నారు. బ్యాంకు అధికారులు, ఏటీఎంలు, బ్యాంకుల్లో డబ్బుల వివరాలను వెల్లడిస్తున్న తొందరగా ఖాళీ కావడంపై అనుమానాలు నెలకొంటున్నారుు. ఒక్కో ఖాతాదారుడు ఏటీఎం నుంచి ప్రస్తుతం రూ.2 వేల డ్రా చేయగలుగుతున్నాడు. అరుునా డబ్బులు సరిపోవడం లేదు. కొందరు ఖాతాదారులు ఏటీఎంల నుంచి రూ.100 నోట్లు తీసుకుని రద్దరుున పాత నోట్లు కమిషన్ రూపంలో తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నారుు. బ్యాంకుల్లో సైతం ఖాతాదారులు నోట్ల మార్పిడికి బారులు తీరుతున్నారు. చాల చోట్ల బ్యాంకుల్లో డబ్బులు లేకపోవడంతో వెనుతిరుగుతున్నారు. కొత్త రూ.500 నోట్లు అందుబాటులోకి వస్తే తప్ప సమస్య కొలిక్కి వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం యాసంగి సమయం కావడంతో రైతులు పంటలు వేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. రద్దు అరుున నోట్లతో ప్రజలు నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయలేక విలవిలాడుతున్నారు.

అంతర్గతంగా మార్పిడి
కొత్త, పాత నోట్ల మార్పిడి జోరుగా కొనసాగుతున్నారుు. 30 నుంచి 35 పర్సంటేజీలు తీసుకుంటూ నోట్ల మార్పి చేస్తున్నారు. కొందరు గ్రూపుగా ఏర్పడి బడాబాబులను సంప్రదిస్తు మార్పిడికి తెరలేపారు. ఒక్కో గ్రూపు వద్ద కొత్త నోట్లు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. వినాయక్‌నగర్, గంగాస్థాన్ ప్రాంతాల్లో రాత్రివేళలో వ్యవహారాలు కొనసాగుతున్నారుు. రాజకీయ నాయకులు, డాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నోట్ల మార్పిడిలో ప్రధానంగా ఉన్నారు.

ఐటీ డేగకన్ను
మరోవైపు అధిక లావాదేవీలు కొనసాగిస్తున్న వారిపై ఆదాయపన్ను శాఖ కన్నెసింది. జిల్లా కేంద్రంలోనే ఒక బృందం ఈ లావాదేవీలపై నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదివరకే అధిక లావాదేవీలు కొనసాగించిన వారిని గుర్తించినట్లు సమాచారం. త్వరలోనే తనిఖీలు చేసే అవకాశం ఉంది. మరోవైపు బ్యాంకు అధికారులు రోజువారిగా నోట్ల మార్పిడి, ఖాతాదారులు ఎంత వరకు డ్రా చేశారన్న వివరాలను బయటకు పొక్కనివ్వడం లేదు. వీటన్నింటిని ఉన్నతాధికారులు సమ్రగంగా పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది.

భారీగా పన్నుల వసూలు
జిల్లాలో పన్నులు మాత్రం భారీగా వసూలయ్యాయి. నవంబర్ 9 నుంచి గురువారం వరకు ఆయా విభాగాల్లో వసూళ్లు పెరిగాయి. కరెంటు బిల్లులు  రూ.4.70 కోట్లు వసూలయ్యాయి. ఇంటి పన్నులు రూ.2.85 కోట్లు వసూలు చేశారు.  చివరి రోజైన గురువారం ఒక్కరోజే అత్యధికంగా రూ.39 లక్షలు వసూలయ్యాయి.  జిల్లావ్యాప్తంగా ఇంటి పన్ను వసూళ్ల లక్ష్యం రూ.32.76 కోట్లు లక్ష్యం నిర్ధేశించుకోగా.. నేటి వరకూ రూ.6.37 కోట్లు వసూలు చేశామని డీపీవో కృష్ణమూర్తి తెలిపారు. నగర కార్పొరేషన్‌కు రూ.4.25 కోట్ల ఆదాయం సమకూరింది. ఆస్తిపన్నుతోపాటు వివిధ పన్నులను నగర ప్రజలు రెట్టింపు స్థాయిలో చెల్లించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement