ఎన్ని అడ్డంకులొచ్చినా స్టేషన్‌ను మార్చి తీరుతాం | one town police station will be shifted | Sakshi
Sakshi News home page

ఎన్ని అడ్డంకులొచ్చినా స్టేషన్‌ను మార్చి తీరుతాం

Published Thu, Oct 6 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సత్యప్రభ

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సత్యప్రభ

 
– విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు వెల్లడి
 
చిత్తూరు గిరింపేట: నగర అభివృద్ధి కోసం ఎన్ని అడ్డంకులొచ్చినా చిత్తూరు నడిబొడ్డులోని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ను మార్చి తీరుతామని చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ, టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 50 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి ఈ రెండున్నర సంవత్సరాల్లోనే చేశామన్నారు. ప్రభుత్వ నిధులే కాకుండా తమ శ్రీనివాస ట్రస్టు ద్వారా లక్షల రూపాయలను నగరాభివృద్ధికి ఖర్చు పెట్టామన్నారు. నగర నడిబొడ్డులోని పోలీస్‌స్టేషన్‌ను ఇతర ప్రాంతానికి తరలించి ఆ ప్రాంతంలో గాంధీ, పూలే, ఎన్టీఆర్‌ విగ్రహాలను ఒకే చోట ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎన్నో ఏళ్ల క్రితం సిమెంట్‌తో నిర్మించిన గాం«ధీ విగ్రహం మరమ్మతులకు గురవుతున్నా ఆ విగ్రహం అక్కడే ఉండాలని పలువురు కోరుకోవడం దారుణమన్నారు. రాష్ట్ర నాయకుడు దొరబాబు మాట్లాడుతూ గతంలో ఉన్న శాసనసభ్యులు చిత్తూరు అభివృద్ధికి ఏ మాత్రం కృషి చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరముందన్నారు. ఎన్నోఏళ్లుగా జరగని సంతపేట రోడ్డు విస్తరణ పనులు ఈ ఏడాది చేపట్టామన్నారు. త్వరలో కట్టమంచి నుంచి గిరింపేట లోని దుర్గమ్మ గుడి వరకు గల హైవే రోడ్డును విస్తరణ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కొంతమంది పనులను అడ్డుకోవడానికి కుట్ర పన్నడం అన్యాయమన్నారు. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా అభివృద్ధి పనులను నిలిపే ప్రసక్తే లేదన్నారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్‌ మేయర్‌ సుబ్రమణ్యం, టీడీపీ నాయకులు నాని, మాపాక్షి మోహన్, ప్రవీణ్, చక్రి, కార్పొరేటర్లు ఇందు, అన్నపూర్ణ, మురుగేష్, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.
  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement