‘మిర్యాల’లో ఆన్‌లైన్ ప్రజాభిప్రాయ సేకరణ
‘మిర్యాల’లో ఆన్‌లైన్ ప్రజాభిప్రాయ సేకరణ
Published Fri, Sep 9 2016 6:42 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ నియోజకవర్గాన్ని నల్లగొండ జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ శుక్రవారం బీసీ యువ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద ‘ఆన్‌లైన్’ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ యువ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుమలగిరి అంజి మాట్లాడుతూ మిర్యాలగూడను నల్లగొండ జిల్లాలో కానీ సూర్యాపేట జిల్లాలో కానీ కలపాలంటే ముందుగా ప్రజల అభిప్రాయం మేరకే చేయాలన్నారు. అన్నీ సౌకర్యాలు కలిగి ఉన్న మిర్యాలగూడను జిల్లా చేయకుండా ఏ అర్హతలేని సూర్యాపేటను జిల్లా చేయడంలో అంతర్యమేమిటన్నారు. కొంతమంది నాయకులు నల్లగొండ జిల్లాలో కాకుండా సూర్యాపేట జిల్లాలో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని కలపాలని కోరడం సరైంది కాదన్నారు. నల్లగొండ జిల్లాలోనే మిర్యాలగూడను కొనసాగించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు టి.కోటేశ్వర్‌రావు, శ్రీను, ఇండ్ల గణేష్, కుర్ర విష్ణు, వేణు, హుస్సేన్, షోయబ్, శివకుమార్, శంకు, వినయ్, శ్రవణ్, కిరణ్, బచ్చలకూరి శ్రీనివాస్ తదితరులున్నారు.
Advertisement