
షార్ట్ సర్క్యూట్‌తో ఆప్టికల్ షాపు దగ్ధం
పట్టణంలోని మెయిన్ బజారులో ఉన్న ఆప్టికల్ షాపు శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పూర్తిగా దగ్ధమైపోయింది.
హిందూపురం అర్బన్ : పట్టణంలోని మెయిన్ బజారులో ఉన్న ఆప్టికల్ షాపు శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పూర్తిగా దగ్ధమైపోయింది. గంట తర్వాత షాపులో నుంచి పొగలు వస్తుండటంతో స్థానికులు గమనించి షాపు నిర్వాహకుడు ఉమర్‌కు సమాచారం అందించారు.
వెంటనే అక్కడికి చేరుకునే లోపు వస్తువులన్నీ కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే షాపులో అద్దాలు, ప్లాస్టిక్ వస్తువులు, ఇతర వస్తువులన్నీ కాలిపోవడంతో రూ.5లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు.