
కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
- ‘గోదావరి’తో కల నెరవేర్చుకుందాం
- భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట జోన్: ‘60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ నిర్మించలేదు. దీంతో రాష్ర్టం కరువుతో అల్లాడింది. గోదావరి జలాలను తరలించి మెతుకుసీమ కరువును శాశ్వతంగా పారతోలుదాం. ప్రస్తుత కరువులో వెయ్యి టీఎంసీల నీరు వృదాగా సముద్రంలో కలుస్తుంది. అలాంటి గోదావరి జలాలను ప్రాజెక్ట్‌ల ద్వారా రైతు ముంగిట్లోకి తీసుకోచ్చి రెండో పంట పండించే హక్కును సాధించుకుందా’మని రాష్ర్ట భారీనీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు.
ఆదివారం చిన్నకోడూరు మండలం మాటిండ్ల మదిర శేఖర్‌రావుపేటలో మిషన్ భగీరథ కింద తాగునీటి నల్లాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో రెండు పంటలు పండే పరిస్థితి మెదక్ జిల్లాలో రానుందన్నారు. రాష్ర్ట ప్రభుత్వం రైతులకు 12 గంటల విద్యుత్‌ను అందిస్తున్నప్పటికి ప్రకృతి సహకరించకపోవడంతో భూగర్భజలాలు అడుగంటయన్నారు.
గోదావరి జలాలతో కరువ సమస్యకు పరిష్కారం దొరకనుందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ర్ట ప్రభుత్వం ముందకుసాగుతుందన్నారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తామన్నారు. దసరా నాటికి మండలంలో ఇంటింటికి నల్లా కనెక‌్షన్ ద్వారా నీటిని అందిస్తామన్నారు.