బీజేపీ రాకతోనే పాక్ దాడులు పెరిగాయి | pak attacks incresed after bjp come in to power | Sakshi
Sakshi News home page

బీజేపీ రాకతోనే పాక్ దాడులు పెరిగాయి

Published Wed, Aug 19 2015 11:14 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బీజేపీ రాకతోనే పాక్ దాడులు పెరిగాయి - Sakshi

బీజేపీ రాకతోనే పాక్ దాడులు పెరిగాయి

హైదరాబాద్: బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పాకిస్తాన్ దాడులు పెరిగాయని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఎన్నికల్లో లబ్దికోసం బీహార్‌కు భారీ ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేసుతన్నదని ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ..కొత్తగా ఏర్పాటైన పసికూనల్లాంటి తెలంగాణ, ఏపీలను పట్టించుకోకుండా ఎన్నికల్లో తాయిలాలుగా బీహార్ ఎన్నికలకోసం ప్రజాధనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుర్వినియోగం చేస్తున్నాడని విమర్శించారు.

తనకు ధైర్యం ఎక్కువగా ఉందని, పాకిస్తాన్ నుంచి కాశ్మీర్‌ను కాపాడుతానంటూ ఎన్నికలకు ముందు చెప్పిన మోదీ ఇప్పుడేం చేస్తున్నాడని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. అభివృధ్దికోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి నిధులు సాధించుకోవడంలో సీఎం కేసీఆర్ వైఫల్యం చెందినాడని పొన్నం అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement