పరిమితంగా పఠనోత్సవం
పరిమితంగా పఠనోత్సవం
Published Mon, Nov 7 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM
సగం పాఠశాలల్లో కానరాని కార్యక్రమం
సమన్వయ లోపంతో తొలిరోజే గ్రహణం
భానుగుడి (కాకినాడ) : విద్యార్థుల్లో సృజనను వెలికితీసి, పుస్తక పఠనంపై శ్రద్ధ పెంచాలన్న తలంపుతో ఎస్‌సీఈఆర్‌టీ రూపొందించిన పఠనోత్సవం కార్యక్రమం తొలిరోజు జిల్లాలో సగం పాఠశాలలకే పరిమితమైంది. సోమవారం నుంచి ఈనెల 14వ తేదీ వరకు దీని అమలుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన ఈ కార్యక్రమం ఆదిలోనే హంసపాదు అన్నట్టు తయారైంది.
సమావేశమేదీ..సమన్వయం ఎక్కడ?
అక్టోబరు 27న ఎస్‌సీఈఆర్‌టీ ద్వారా వెలువడిన ఉత్తర్వుల ప్రకారం డీఈవో సంబంధిత ఉపవిద్యాశాఖాధికారులతో, మండల విద్యాశాఖాధికారులతో, రాజీవ్ విద్యామిషన్, సర్వశిక్షాభియాన్, డైట్ ప్రిన్సిపాల్స్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఆయా అ«ధికారుల సమన్వయంతో అన్ని పాఠశాలల్లోను కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. జిల్లాలో సోమవారం నుంచి పఠనోత్సవాలు ప్రారంభమయినా ఇప్పటి వరకు ఏ అ«ధికారితోను డీఈవో సమావేశం నిర్వహించలేదు. జిల్లాలో సగానికి పైగా పాఠశాలలకు ఈ కార్యక్రమ వివరాలు తెలియలేదు. ప్రతి చిన్న విషయాన్ని డీఈవో వెబ్‌సైట్లో ఉంచే అ«ధికారులు ఈ రాష్టస్థాయి కార్యక్రమాన్ని విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. మండల విద్యాశాఖాధికారులు, ఉపవిద్యాశాఖాధికారులు ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి కార్యక్రమాన్ని జరిపించాలి. పైస్థాయిలోనే పక్కతోవ పట్టడంతో మండల, డివిజ¯ŒS స్థాయిలోను అదే తరహా ధోరణి నెలకొంది. దీంతో సమాచారం తెలిసిన పాఠశాలల్లో మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సగం పాఠశాలల్లో నిల్.
జిల్లాలో 1నుంచి 10వ తరగతి వరకు 5,760 పాఠశాలల్లో 7లక్షల50వేలమంది విద్యార్థులకు ఈ పఠనోత్సవ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. పదోతరగతి విద్యార్థులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందే. రోజువారీ 6, 7, 8 పిరియడ్లలో ఈ కార్యక్రమం జరగాలి. కనీసం రెండోరోజైనా జిల్లా అధికారులు శ్రద్ధ తీసుకుని విద్యార్థులకు ఉపకరించే కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమలుపరచాలని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. కాకినాడలో ఎండోమెంట్ పాఠశాల, గుడారిగుంట, గాంధీనగర్ మినహా మిగిలిన పాఠశాలల్లో పద్యపఠనాన్ని అయిందనిపించడం గమనార్హం. దీనిపై కలెక్టర్ విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారంటున్నారు.
కొన్నిచోట్లే ప్రారంభం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : జిల్లాలో సోమవారం కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ పఠనోత్సవాలను ఈనెల 14 వరకు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించించారు. విద్యార్థులు ఒక కథ రాస్తే దానికి శీర్షిక, చక్కని ప్రారంభ వాక్యాలు, ముగింపు ఉండేలా ఉపాధ్యాయులు సలహాలు ఇవ్వాల్సివుంది. దాతల ద్వారా గ్రంథాలయ పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చూడాలి. సోమవారం పద్యపఠనం ప్రారంభంకాగా, ఎనిమిదిన కథలు చెప్పించడం, తొమ్మిదిన వ్యాసాలు, కథనాలపై స్పందన, 10న నాటికలు, 11న సృజనాత్మక రచనలు ఉంటాయి. వీటిలో మంచి ప్రతిభ కనపర్చిన వారికి ఈనెల 14 బాలల దినోత్సవం నాడు బహుమతులు అందజేస్తారు. వీటిలో ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులంతా పాల్గొనేలా చూడాల్సిన బాధ్యత ప్రధానోపా«ధ్యాయులదే. ఈ పఠనోత్సవాలపై రోజువారీ నివేదికను జిల్లాలోని స్థానిక విద్యాశాఖ కార్యాలయాల్లో అందజేయాల్సి వుంది. పఠనోత్సవాలను నిత్యం పర్యవేక్షిస్తామని డిప్యూటీ స్కూల్స్ ఆఫ్ ఇన్ స్పెక్టర్ అయ్యంకి తులసీదాస్ తెలిపారు. వీటిని పాటించని పాఠశాలలపై తగు చర్యలు చేపడతామన్నారు.
Advertisement
Advertisement