రోగి సహాయకులకు రోజు కూలీ చెల్లింపు
-
ఐటీడీఏ పీఓ చక్రధర్‌బాబు వెల్లడి
వీఆర్‌పురం:
కాళ్లవాపు వ్యాధి బారినపడి చికిత్సకోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించే రోగికి సహాయకుల్లో ఒకరికి రోజు కూలీ కట్టి, ఎన్ని రోజులుంటే అన్ని రోజులూ చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీఓ కేవీఎన్ చక్రధర్‌బాబు చెప్పారు. ఏఎస్‌డీఎస్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం నుంచి ఈ వ్యాధిపై ఇంటింట సర్వే చేపట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కావడం మూలంగా ఎవరైనా ఈ వ్యాధి బారిన పడినట్లైతే ఆ రోగికి సహాయకులుగా వెళ్లేందుకు బంధువులు వెనుకాడకుండా ఉండేందుకే సహాయకుడికి రోజు కూలి చెంల్లించేలా ప్రణాళిక చేశామన్నారు. ఈ వ్యాధి ప్రభావిత గ్రామాల్లో నిపుణులైన వైద్యుడితో ప్రత్యేక వైద్య శిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ పవన్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు ముత్యాల కుసుమాంబ, సివిల్ సర్జన్ ఎ.రామారావు, ఎంపీడీఓ జి.సరోవర్, హాస్పటల్ కమిటీ చైర్మెన్ వి.గాంధీబాబు, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ ఎం.దుర్గాప్రసాద్, ప్రదీప్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.