అన్నదాతలకు అందని సహకారం
• డీసీసీబీల్లో పాత నోట్ల మార్పిడి నిలిపివేతతో తంటాలు
• రైతులకు సహకారం అందించలేని దుస్థితిలో డీసీసీబీలు
• పెట్టుబడులకు ఇబ్బందులు పడుతున్న రైతులు
నల్లగొండ అగ్రికల్చర్‌ః రిజర్వ్ బ్యాంకు తీసుకున్న నిర్ణయం అన్నదాతలకు శాపంగా మారింది. రబీ పెట్టుబడుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఉన్న పాతనోట్లను జిల్లా సహకార బ్యాంకుతో పాటు బ్రాంచీలలో జమచేసే అవకాశం లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లా సహకార బ్యాంకు లు, సహకార బ్యాంకుల బ్రాంచీలలో పాత రూ.1000, రూ.500లను ఖాతాదారులు జమచేయడాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు నోట్ల మార్పిడీలో నిబంధనలను తుంగలో తొక్కారనే కారణాన్ని చూపుతూ భారతీయ రిజర్వ్‌బ్యాంకు సహకార బ్యాంకుల్లో నోట్ల మార్పిడిని నిలిపివేయడం అటు రైతుల్లో, ఇటు సహకార బ్యాంకు ఉద్యోగుల్లో అందోళన కలిగిస్తోంది.
రబీ సీజన్ ఆరంభమై నెల రోజులు గడుస్తుండడంతో పాటు నోట్ల మార్పిడి కా రణంగా బ్యాంకులు అన్ని బిజీబిజీగా ఉండడంతో రబీ రుణాలను అందించలేని పరిస్థితుల్లో బ్యాం కులు ఉన్నాయి. సీజన్ నెత్తిన కూర్చుండడంతో రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుతో పాటు దుక్కలు దున్నకాల వంటి పనులకు పెట్టుబడుల కోసం పరుగులు పెడుతున్నారు. తమ దగ్గర ఉన్నపాటి డబ్బులను కనీసం సహకార బ్యాంకుల్లో జమచేసుకుని తరువాత డ్రా చేసుకుని పెట్టుబడులకు ఉపయోగించుకోవచ్చన్న ఆలోచనలో ఉన్న రైతులకు ఆర్‌బీఐ దెబ్బకొట్టింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జిల్లా సహాకార కేంద్ర బ్యాంకుతో పాటు 30 సహకార బ్యాంకుల బ్రాంచీలు, 107 సహకార సంఘాలు ఉన్నాయి.
అయితే సహకార సంఘాల సభ్యులు మొత్తం 2లక్షల 20 వేల మంది ఉండగా అందులో లక్షా 19 వేల 47 మంది రైతులు రుణాలు పొందారు. అందులో సేవింగ్ ఖాతాలు ఉన్న రైతులు 86 వేల 904 మంది ఉన్నారు. ఆర్‌బీఐ నిర్ణయం కారణంగా ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైతుల ఖాతాల్లో పాతనోట్లను జమచేసి వారికి సహకారం అందించలేని పరిస్థితుల్లో సహకార బ్యాంకు ఉద్యోగులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పాతనోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తరువాత ఈ నెల 10 నుంచి 14 వ తేదీ వరకు జిల్లా సహకార బ్యాంకుతో పాటు 30 బ్రాంచీల్లో ఖాతాదారులు సుమారు రూ.20 కోట్ల మేరకు తమ ఖాతాల్లో జమచేసుకున్నారు.
ఆర్‌బీఐ నిర్ణయం వలన బ్యాం కు ఖాతాదారులకు తీవ్రంగా నష్టం వాటిల్లి ఖాతాలను ఉపసంహరించుకునే ప్రమాదం ఉందని, బ్యాంకు ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుందని బ్యాంకు ఆధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రైతులతో పాటు బ్యాంకు సిబ్బంది కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఆర్‌బీఐ నిర్ణయాన్ని తక్షణమఉపసంహరించుకోవాలి
సహకార బ్యాంకులలో పాతనోట్ల మార్పిడిని నిలిపివేస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంకు తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఉపసంహరించుకునే విధంగా ముఖ్యమంత్రిలో పాటు కేంద్రమంత్రులపై వత్తిడి తేవడానికి డీసీసీబీల చైర్మన్‌లు కృషి చేయాలని తెలంగాణ కోఆపరేటీవ్ సెంట్రల్ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బీఎల్‌ఎన్ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.జనార్దన్‌రావు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక డీసీసీబీలో జరిగిన యూనియన్ సమావేశంలో వారు మాట్లాడారు. కొన్ని కారణాలు చూపుతూ బ్యాంకుకు వ్య వస్థకే భంగం కలిగే విధంగా ఆర్‌బీఐ నిర్ణయిం చడం సరికాదన్నారు.
కోర్‌బ్యాంగింగ్ సిస్టం ఉన్న డీసీసీబీల్లో నోట్ల మార్పిడిని రద్దు చేసి గ్రామీణ స్థాయిలో ఉన్న చిన్నచిన్న బ్యాంకులకు అనుమతినివ్వడం సరికాదన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సహకార బ్యాంకు చైర్మన్లు ఆర్‌బీఐ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే విధంగా ప్రభుత్వంపై వత్తిడిని తీసుకురావాలని కోరారు. ఆర్‌బీఐ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల 18 నుంచి 21 వరకు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు, 22న అన్ని రాష్ట్రా ల రాజధానిల్లో రైతులతో కలిసి ఆందోళనలు, 25న సహకార బ్యాంకులను బంద్ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో యూనియన్ జిల్లా ప్ర ధాన కార్యదర్శి ఎం.కరుణాకర్‌రెడ్డి ఉన్నారు.