పోలీసులపైకి ప్రజలు తిరగబడ్డారు.
పుంగనూరు: పోలీసులపైకి ప్రజలు తిరగబడ్డారు. రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. అనంతరం పోలీసులను పోలీస్ స్టేషన్ లోపలే ఉంచి బయట తాళం వేశారు. ఈ సంఘటన చిత్తూరు సోమల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో శనివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. సోమలలోని ప్రభుత్వ స్థలంలో స్థానికంగా నివాసం ఉంటున్న రెడ్డెమ్మ రవికుమార్ ఇల్లు కట్టుకుంటున్నాడు.
అది ప్రభుత్వ స్థలం కావడంతో పాటు ఆ నిర్మాణం పూర్తయితే రోడ్డు ఉండదని గ్రహించిన గ్రామస్థులు నిర్మాణాన్ని అడ్డుకున్నారు. దీంతో రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టకుండా.. ఫిర్యాదులో పేర్కొన్న 30 మందిని స్టేషన్‌కు పిలిపించి అకారణంగా వారిపై చేయి చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసులపై దాడి చేసి వారిని లోపల ఉంచి బయట తాళం వేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.