ఉట్నూర్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలి
-
పుల్లారా గ్రామంలో ఏజేఏసీ ఆధ్వర్యంలో తుడుంమోత
-
భారీగా తరలిన ఆదివాసీ గిరిజనులు
నార్నూర్ (సిర్పూర్(యు) : ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతు ఉట్నూర్ కేంద్రంగా కొమురం భీమ్ జిల్లా ఏర్పాటు చేయాలని ఆదివాసీ సంఘాల ఐక్యకార్యచరణ సమితి జిల్లా అధ్యక్షుడు కనక యాదవ్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం సిర్పూర్–యు మండలంలోని పుల్లార గ్రామంలో కొమురం భీమ్ జిల్లా సాధన ఉద్యమాన్ని ప్రారంభిస్తూ తుడంమోత కార్యక్రమం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో ఎంతో ఐక్యంగా ఉన్న ఆదివాసీ గిరిజనులను జిల్లాల పేరిట విడగొట్టడం సరికాదన్నారు. విభజనతో ఆదివాసీల సంస్కతి, సంప్రదాయాలు, వేష, భాషలు విచ్ఛినం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆదివాసీ ప్రాంతాలను విడదీసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఉట్నూర్ కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు అన్ని వర్గాల ప్రజలతో ఐక్య కార్యచరణ సమితి ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో భీమ్ మనవడు సోనేరావు, తుడందెబ్బ జిల్లా కార్యదర్శి కొడప నగేశ్, జిల్లా సార్‌మెడి మేస్రం దుర్గు, ఏవీఎస్‌పీ జిల్లా ప్రధాన కార్యదర్శి వినాయక్‌రావు, ఆత్రం భగవంత్‌రావు, కొడప హన్ను పటేల్ పాల్గొన్నారు.